అన్వేషించండి

మసీదుని కూల్చేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై ముస్లింల రాళ్ల దాడి - ఒకరు మృతి

Gutarat Violent Protest: గుజరాత్‌లోని జునాగఢ్‌లో మసీదుని కూల్చేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేశారు.

Gutarat Violent Protest: 


జునాగఢ్‌లో ఘటన..

గుజరాత్‌లోని జునాగఢ్‌లో యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. మసీదుని అక్రమంగా నిర్మించారని నోటీసులు రావడంపై స్థానిక ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 500-600 మంది రోడ్లపైకి వచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు విసిరారు. జూన్ 16న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ అల్లర్లు జరిగాయి. మజేవాది గేట్‌ ముందు ఓ మసీదుని అక్రమంగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని 5 రోజుల్లో సమర్పించాలని తేల్చి చెప్పారు. ఆ గడువు ముగిసిపోవడం వల్ల కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఓ టీమ్‌ అక్కడికి వచ్చి మసీదుని కూల్చే ప్రయత్నం చేసింది. ఇది చూసిన వెంటనే పెద్ద ఎత్తున ముస్లింలు అక్కడికి వచ్చారు. పోలీసులపై రాళ్లు విసరడం మొదలు పెట్టారు. అక్కడి వాహనాలకు నిప్పంటించారు. ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు ANI న్యూస్ ఏజెన్సీ ట్విటర్‌లో షేర్ చేసింది. జునాగడ్ ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం...ఒక్కసారిగా 174 మంది పోలీసులను చుట్టుముట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మొహరించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఏ కట్టడాన్నైనా కూల్చేందుకు వెనకాడడం లేదు. మసీదుని కూడా ఓ ఆక్రమిత స్థలంలో కట్టారని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. 

"మజేవాది గేట్ ముందున్న మసీదుని అక్రమంగా నిర్మాణంగా జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ తేల్చింది. దీనిపై ఆ మసీదుకి నోటీసులు ఇచ్చింది. ఐదు రోజుల్లోగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పింది. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మేమంతా స్పాట్‌కి వెళ్లగానే ఒక్కసారిగా 500-600 మంది గుమిగూడారు. రోడ్‌లను బ్లాక్ చేయొదన్ని చాలా సేపు రిక్వెస్ట్ చేశాం. అయినా వాళ్లు వినలేదు. మాపై రాళ్లు విసిరారు. ఈ దాడుల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం"

- రవితేజ వశంశెట్టి, జునాగఢ్ ఎస్‌పీ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2026 Wishes : సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Temple Style Sweet Pongal : భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2026 Wishes : సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఇలా విష్ చేయండి
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Temple Style Sweet Pongal : భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Embed widget