By: ABP Desam | Updated at : 05 Sep 2021 01:30 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హేయిర్ కట్టింగ్ విషయంలో స్నేహితుల పరస్పర దాడి(ప్రతీకాత్మక చిత్రం)
ఇద్దరి స్నేహితుల మధ్య హెయిర్ కట్టింగ్ విషయంలో మొదలైన గొడవ ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దారితీసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భవానీనగర్‌లో శనివారం ఇద్దరి స్నేహితుల మధ్య హెయిర్ కట్టింగ్ విషయంలో ఘర్షణ జరిగింది. సూరగాని ఆంజనేయులు తండ్రి శ్రీనివాసరావుతో కలిసి కటింగ్ చేయించుకునేందుకు హెయిర్ కటింగ్ షాపుకు వచ్చాడు. అక్కడే ఉన్న స్నేహితుడి తండ్రి చల్లా శ్రీనివాసరావు హెయిర్ కటింగ్ మంచిగా చేయించుకోవాలని ఆంజనేయులితో అన్నాడు. నవ్వేంటి నాకు చెప్పేదని కోపంతో ఆంజనేయులు చల్లా శ్రీనివాసరావుపై దాడి చేసి చెంపపై కొట్టాడు.
ఈ సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసరావు కొడుకు నాగేంద్రబాబు తన తండ్రినే కొడతావా అంటూ స్నేహితుడితో ఘర్షణకు దిగాడు. నువ్వేంట్రా నాకు చెప్పేదంటూ ఆంజనేయులు ఎదురుదాడికి పాల్పడ్డాడు. కోపం ఎక్కువై పక్కనే ఉన్న కత్తెర తీసుకొని నాగేంద్రబాబు మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నాగేంద్రబాబును పిడుగురాళ్ల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చల్లా శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలు, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్‌రావుకు గాయాలయ్యాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్యం వివాదం తలెత్తింది.
తాడిపత్రిలో వైసీపీ నేత హత్య
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత పోతులయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం పెన్నా నదిలో పోతులయ్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి వాసిగా పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోతులయ్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పోతులయ్యను చంపి పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తాడిపత్రిలో మళ్లీ రాజకీయ హత్యలు మొదలవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుకున్నారు.
Also Read: Viral Video: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం... రోడ్డుపై కొట్టుకున్న వైద్యుడు, మహిళ
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Crime News: ఎలాంటి పరీక్షలు, ప్రాక్టికల్స్ లేకుండా 3 లక్షలకే బీటెక్ సర్టిఫికెట్
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!
Hyderabad Crime : గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని కత్తితో దాడిచేసిన బాలుడు, రక్తం కారుతుంటే సెల్ఫీ!
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర