Guntur: మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలు.. టీడీపీ నేత హత్య, గ్రామ నడిబొడ్డులోనే దారుణంగా..
తోట చంద్రయ్య హత్యను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గుండ్లపాడు వెళ్లనున్నారు.
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ గ్రామానికి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రయ్య ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థుతో గత కొన్ని రోజులుగా ఈయనకు వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చంద్రయ్యపై కోపం పెంచుకున్న ప్రత్యర్థులు అతని అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే చంద్రయ్య పని నిమిత్తం గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. అప్పటికే అతని కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్‌కు కర్ర అడ్డు పెట్టి కిందపడేలా చేశారు. అనంతరం అతని తలపై రాయితో కొట్టి తరువాత కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ ఏర్పాటు చేశారు. కాగా, గ్రామంలో ఆదిపత్య పోరుకోసమే ఈ హత్యకు పాల్పడి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్యను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గుండ్లపాడు వెళ్లనున్నారు.
ప్రజాస్వామ్యం గొంతు కోస్తున్న వైసీపీ రౌడీలు! మాచర్లలో టీడీపీ నాయకుడు తోటా చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/nwV3S81vne
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 13, 2022
టీడీపీ నేతల ఆగ్రహం
ఓటమి భయంతో వైఎస్ఆర్ సీపీ పాలకులు ఫ్యాక్షన్‌కు మళ్లీ పురుడు పోస్తున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, దూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే పిన్నేల్లి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Sankranti 2022: అద్దాల అంగడిలో అందమైన పల్లె! పట్నం మరచిన పండగ, సందడి అంతా అక్కడే..
Also Read: Mohan Babu University: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...
Also Read: Chiranjeevi: సీఎం జగన్‌తో చిరు లంచ్.. వ్యక్తిగతమా? లేదా చొరవ తీసుకుంటున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి