X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Guntur Crime: సంచలనం రేపుతున్న గుంటూరు గ్యాంగ్ రేప్... భర్తను కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం.... కొడవళ్లతో బెదిరించి నగలు, నగదు అపహరణ

గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన సామూహిక అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. బైక్ వెళ్తున్న భార్యభర్తను కర్ర అడ్డుపెట్టి పడగొట్టి, పొలాల్లోకి లాక్కెళ్లి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

FOLLOW US: 

గుంటూరు జిల్లాలో గురువారం దారుణమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరుకు 28 కి.మీ దూరంలో బుధవారం రాత్రి వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారికాసి, భార్యభర్తలిద్దరినీ తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా అపహరించారు. మూడు నెలల కిందట తాడేపల్లికి సమీపంలో సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద సామూహిక అత్యాచార ఘటన మరవకముందే అదే తరహాలో మరో ఘటన జరగడం జిల్లాలో కలకలంరేపుతోంది. 

కర్ర అడ్డుపెట్టి.. బైక్ పడగొట్టి

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యి రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారికి అడ్డంగా ఓ చెట్టు కొమ్మ పడిఉంది. దాన్ని తప్పించి బైక్ ను ముందుకు వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా దుండగులు ఓ కర్రను బైక్‌ చక్రంలో పెట్టి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే వారిపై దాడిచేశారు. కొడవళ్లు చూపించి సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల ద్విచక్రవాహనాన్ని కూడా పొలాల్లోకి లాక్కె దించేశారు. బాధితురాలి భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఇటీవల దారి దోపిడీలు

అత్యాచారం అనంతరం దుండగులు బాధితురాలి వద్ద బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. దుండగుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని, ఒకరు వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించినట్లు పేర్కొన్నారు. స్థానికులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మేడికొండూరు మండలంలో ఇటువంటి దోపిడీలు ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు అంటున్నారు. వీటి వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో పోలీసుల గాడ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఓ జాగితం దగ్గర్లోని గిడ్డంగి దగ్గరకు వెళ్లి ఆగింది. ఘటనాస్థలికి దగ్గర్లో శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు పనిచేస్తున్నారు. పోలీసులు అక్కడ పనిచేస్తున్న కూలీలను విచారించారు. బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు

బుధవారం రాత్రి సంఘటన అనంతరం బాధితులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. కానీ పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ మేడికొండూరుకు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సత్తెనపల్లి స్టేషన్‌కు చేరుకునే వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. చివరికి బాధితుల్ని మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ కేసు పెట్టారు. ఆపదలో ఉన్న బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

Also Read: Bankers Meeting: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరిన ఏపీ సీఎం జగన్

Tags: AP News AP Latest news Crime News Guntur crime Guntur news guntur rape case

సంబంధిత కథనాలు

East Godavari Crime: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు

East Godavari Crime: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు

CBI Arrest: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ

CBI Arrest: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ

Ananthapur: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం

Ananthapur: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం

Madan Lal Son : మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !

Madan Lal Son :  మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !

Hyderabad: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతికి గంజాయి గిఫ్టుగా ఇచ్చాడు.. తర్వాత ట్విస్టు మామూలుగా లేదు..

Hyderabad: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతికి గంజాయి గిఫ్టుగా ఇచ్చాడు.. తర్వాత ట్విస్టు మామూలుగా లేదు..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..