News
News
X

Guntur Crime News: ఆటో డ్రైవర్‌తో వెళ్లిపోయిన కూతురు - తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తల్లి

Guntur Crime News: గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని ఆటో డ్రైవర్ తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అది తెలిసిన తల్లి తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

FOLLOW US: 
Share:

Guntur Crime News: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించింది. వద్దని చెబుతున్నా వినకుండా అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన పరువు పోయిందని బావురుమంది. ఊళ్లో వాళ్లు అంటున్న మాటలు వినలేక.. తన కూతురు పరువు తీసి వెళ్లిపోయిందని భావించిన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండారం గ్రామంలో పరువు ఆత్మహత్య చోటు చేసుకుంది.  దాసరి అనితకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం అయింది.  అయితే రెండో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసుకున్న తల్లి పలుమార్లు కూతురును మందలించింది. ఈ నెల ఏడవ తేదీన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన ఆటో డ్రైవర్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లి అనిత తల్లడిల్లి పోయింది. గ్రామంలో పలు విధాలుగా ప్రచారం జరగడంతో తట్టుకోలేక పోయింది. ఈ ప్రేమ వివాహంతో తమ కుటుంబ పరువు రోడ్డుపై పడిందని ఆవేదన చెందింది.ఈ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రేమించిన వాడితో కలహాలు - తట్టుకోలేక యువతి బలవన్మరణం

ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంట ప్రయాణం కొంత కాలం బాగానే సాగింది. అనంతరం వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌కు అదే గ్రామానికి చెందిన దేవికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే జనవరి 12వ తేదీ నాడు సతీష్‌ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సతీష్, దేవి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం సతీష్‌ తిరిగి పనికి వెళ్లిపోయాడు.

ఈగల మందు తాగి ఆత్మహత్య 

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దేవి ఇంట్లో ఉన్న ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న దేవిని గమనించిన అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవి, సతీష్‌లది ప్రేమ వివాహం అని, అయితే సతీష్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటీవల దేవి కుటుంబ సభ్యులు సతీష్ ను అడిగితే, దేవిని కొట్టాడని దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో  తెలిపారు. అయితే సతీష్‌ బలవంతంగా తన చెల్లితో ఈగల మందు తాగించాడనే అనుమానం కూడా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Published at : 11 Mar 2023 12:34 PM (IST) Tags: AP Crime news Mother suicide Woman Committed Suicide Latest Suicide Case Guntur Crime News

సంబంధిత కథనాలు

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!

Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!

Social Media posts Arrests : రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

Social Media posts Arrests :  రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం

Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!