By: ABP Desam | Updated at : 15 Nov 2021 10:26 AM (IST)
Edited By: Venkateshk
సెల్ఫీ వీడియోలో సంతోష్
భార్య పెడుతున్న వేధింపులను భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఎంతో బాధతో ఆయన ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇది చూసిన వారికి జాలి కలిగించేలా ఉంది. పైగా ఆయన ఉన్నత చదువులు చదువుకొని, బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక తనువు చాలించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన సంతోష్ అనే 36 ఏళ్ల వ్యక్తి నగరంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు 2013లో పాత బస్తీకి చెందిన కళ్యాణి అనే యువతితో వివాహం జరిగింది. వీరికి అభిరామ్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అభిరామ్ కొంత కాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్నాడు. దీంతో సంతోష్‌ను భార్య కళ్యాణి కొద్ది రోజులుగా వేధిస్తోంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక సంతోష్ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్‌లో పురుగుల మందు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్ డ్రింకులో ఆ మందును కలిపి తాగేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగానే ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!
సెల్ఫీ వీడియో తీసుకొని..
సంతోష్ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడు సార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని మొత్తం రికార్డు చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరీనాథ్, కళ్యాణి సోదరుడు గణేష్, బాబాయి భీమ్ కలిసి తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించాడు. ఆ నలుగురికి శిక్ష పడేలా చూడాలని అన సోదరుడు అన్వేష్‌ను కోరాడు.
‘‘అమ్మా.. నన్ను క్షమించు. ఎంతో లైఫ్ చూడాలనుకున్నాను. నా కుమారుడికి లైఫ్ ఇవ్వాలనుకున్నాను. నా భార్య నన్ను బజారుకీడ్చి అవమానపరుస్తోంది. అభిరాం నన్ను క్షమించు.. ఆస్తిలో నాకు ఎలాంటి హక్కు లేదు. నా సంపాదన అంతా బాబు చికిత్సకు ఖర్చు చేశాను. కవితక్క నన్ను క్షమించండి. మిమ్మల్ని కూడా కాదు అనుకున్నాను. రెండు మూడుసార్లు నాపై హత్యాయత్నానికి ప్రయత్నించారు’’ అని వాపోయాడు. అనంతరం పురుగుల మందును కూల్ డ్రింకులో కలుపుకొని తాగాడు. గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kurnool: అన్నపై చెల్లెలు పైశాచికం, తల్లి సపోర్ట్‌తో ప్రియుడితో కలిసి ఘోరం - వీడిన మిస్టరీ కేసు
Nizamabad News: సుద్దులం గ్రామంలో దొంగలను చాకచక్యంగా పట్టుకున్న గ్రామస్థులు
Texas: సరిహద్దులోని ట్రక్కులో 46 మృతదేహాలు- అసలేం జరిగింది?
Juvenile Escaped: జువైనల్ హోం నుంచి ఐదుగురు బాల నేరస్తులు పరార్, పోలీసులకు టెన్షన్ టెన్షన్
Uttarakhand Gang Rape : కదిలే కారులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం - ఉత్తరాఖండ్‌లో మరో నిర్భయ !
ONGC Chopper: అరేబియా సముద్రంలో పడిపోయిన ONGC చాపర్- హెలికాప్టర్లో మొత్తం 9 మంది!
T Hub 2 Inauguration Live Updates: ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
July First Release : జూలై 1 విడుదల - వీటి గురించి తెలుసుకోకపోతే ఖర్చలెక్కువైపోతాయ్ !
Maharashtra Political Crisis: 'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్