YCP Leader Attack On Anchor : మార్గాని భరత్ అనుచరుడు మామూలోడు కాదు - అప్పు తిరిగివాలన్నందుకు మహిళా యాంకర్‌పై దాడి !
Crime News : ప్రోగ్రామ్స్‌కు వ్యాఖ్యతగా చేసే మహిళపై మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు దాడి చేశాడు. మూడు లక్షలు అప్పు తీసుకుని అసలు కాదు కదా వడ్డీ కూడా ఇవ్వలేదు. అడిగినందుకు దాడి చేశాడు.
Former MP Margani Bharat follower assaulted a woman anchor : ఖర్చులో ఉన్నాను కాస్త డబ్బుంటే సర్దమని అడిగితే తెలిసినోడే కదా అని రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము మూడు లక్షలు ఇచ్చింది. పైగా అతను రాజకీయాల్లో ఉన్నాడు. అప్పటి ఎంపీ మార్గాని భరత్ కు ముఖ్య అనుచరుడినని చెప్పుకునేవాడు. వైసీపీ కార్మిక విభాగంలో ఓ నేతగా ఉన్నారు. దీంతో సులువుగానే డబ్బు ఇచ్చింది. కానీ మూడేళ్లు గడిచినా ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. కనీసం వడ్డీ కూడా ఇవ్వలేదు. అడిగినందుకు చంపేసినంత పని చేశాడు. రాజమండ్రిలో ఈ ఘటన జరిగింది.
అప్పు తీసుకుని తిరిగి చెల్లించమని అడిగినందుకు దాడి
రాజమండ్రిలో వైసీపీ కార్మిక నేతగా శ్రీనివాస్ ఉన్నాడు. అతను మార్గానికి భరత్ కు ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. ఆయనకు వివిధ కార్యక్రమాలకు యాంగర్‌గా పని చేసే దివ్యతో పరిచయం ఉంది. ఈ పరిచయంతో మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు. విజయవాడలో ఉండే దివ్య తర్వాత హైదరాబాద్‌కు మారారు. ప్రతీ సారి రాజమండ్రి వెళ్లి అడగలేక.. ఫోన్లు చేస్తే స్పందించక చాలా ఇబ్బంది పడ్డారు. తాజాగా ఆమె.. దసరా సందర్భంగా తూ.గో జిల్లాలో ఓ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం చూసుకుని తన తండ్రితో కలిసి డబ్బులు అడిగేందుకు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
దాడి ఘటన దృశ్యాలు వైరల్
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలన్న విషయం మీద వారి మధ్య మాటా మాట పెరిగింది. శ్రీనివాస్ రాజకీయ బలం ఉందనుకున్నారేమో కానీ మహిళ అని చూడకుండా యాంకర్ దివ్యపై దాడి చేశారు. పక్కనే ఉన్న ఆమె తండ్రినీ వదల్లేదు. శ్రీనివాస్ యాంకర్ దివ్యపై ఎంతగా దాడి చేశారంటే ఆమె మొహం మీద పిడిగుద్దులు బాదడంతో తీవ్ర గాయాలయ్యారు. వారి షర్టులు కూడా చినిగిపోయాయి. దాడి ఘటనపై యాంకర్ దివ్యతో పాటు ఆమె తండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు సేకరించి.. సీసీ ఫుటేజీ చూసిన పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వకుండా ఇలా దాడి చేయడమేమిటని వైసీపీ నేతలపై ఇతరులు మండిపడుతున్నారు. దాడి చేయడం అనేది తమ జన్మహక్కన్నట్లుగా వారు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. యాంకర్ గా పని చేసుకుని సంపాదించుకున్న సొమ్మును తీసుకుని తిరిగి ఇవ్వమంటే దాడి చేయడమేమిటని అంటున్నారు. ఈ కేసు విషయంలో మార్గాని భరత్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చారు. నిందితుడు శ్రీనివాస్ ఆయన అనుచరుడిగా చెలామణి అవుతూంటాడు. ఈ ఘటనపై ఆయన ఇంకా స్పందించలేదు.