IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Father Killed Son: కన్న కొడుకుని చంపి పాతిపెట్టేసిన తండ్రి, కారణం ఏంటంటే

మద్యానికి బానిసైన కొడుకుని రోకలిబండతో హత్య చేసి ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి కొడుకు శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు తండ్రి. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల వరకు చేరడంతో..

FOLLOW US: 

Nellore News: మద్యానికి బానిసైన కొడుకుని రోకలిబండతో హత్య చేసి ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి కొడుకు శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు కన్న తండ్రి. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల వరకు చేరడంతో వారు కొడుకు మల్లికార్జున్ శవాన్ని వెలికి తీశారు. శ్మశాన వాటికకు వెళ్లి శవాన్ని వెలికి తీసి రీపోస్ట్ మార్టం చేయించబోతున్నారు. స్థానికంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసులు గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా.. తల్లి పరారీలో ఉంది. 

ఆదివారం (08-05-2022) మధ్యాహ్నం 02.30 గంటలకు నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. బత్తిన శ్రీనివాసులు కుటుంబం అక్కడ నివసిస్తుండేది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోగా.. కుమారుడు మల్లికార్జున (24) లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లికార్జున రోజూ ఇంటికి తాగొచ్చేవాడు. అంతేకాదు, తాగి ఇంటికొచ్చిన తర్వాత అందరికీ నరకం చూపించేవాడు. ఇంట్లో అందరినీ వేధించేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు సరిపోవడంలేదని ఇంట్లో వాళ్లని కొట్టి డబ్బులు తీసుకెళ్లేవాడు. అతనికి ఫిట్స్ వ్యాధి కూడా ఉంది. 

ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె మల్లికార్జున నుంచి తప్పించుకోబోయింది. అయితే అంతలోనే తండ్రి అడ్డుపడ్డాడు. తల్లిదండ్రులపై దాడి చేయడం సరికాదని వారించబోయాడు. దీంతో మల్లికార్జున మరింత రెచ్చిపోయాడు. స్క్రూ డ్రైవరుతో తలపై దాడి చేయడంతో తండ్రి శ్రీనివాసులకు గాయాలయ్యాయి. దీంతో ఆయన కోపంతో ఊగిపోయారు. మల్లికార్జున చంపేస్తాడేమోనన్న భయంతో పక్కనే ఉన్న రోకలి బండతో కుమారుడి తలపై కొట్టాడు. ఆ దెబ్బతో మల్లికార్జున అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హఠాత్పరిణామంతో తల్లి అక్కడినుంచి పరారైంది. ఆ తర్వాత తండ్రి శ్రీనివాసులు కథ నడిపాడు. 

ఫిట్స్‌ తో తన కొడుకు మల్లికార్జున చనిపోయాడని బంధువులను నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఆదివారం రాత్రి శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చేశాడు. కానీ స్థానికులు మాత్రం ఈ వ్యవహారాన్ని చర్చింకుంటున్నారు. చివరకు పోలీసుల వరకు సమాచారం వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. అసలు విషయాన్ని తెలుసుకున్నారు. తలకు గాయమైన తండ్రి శ్రీనివాసులను మొదట ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి పరారు కావడంతో దర్యాప్తు చేస్తున్నారు. 

నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సై రమేష్‌బాబు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. మల్లికార్జున మృతికి కారణాలు తెలుసుకునేందుకు శవాన్ని వెలికి తీశారు. రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టు తెలిపారు సీఐ సుబ్బారావు.

Published at : 09 May 2022 02:23 PM (IST) Tags: Nellore news nellore police Nellore Update Nellore Crime father kills son father son conflict

సంబంధిత కథనాలు

Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లెక్సీ అడ్డురావడంతో బోల్తా పడిన ఆటో,  నలుగురి మృతి

Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లెక్సీ అడ్డురావడంతో బోల్తా పడిన ఆటో, నలుగురి మృతి

Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!

Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!

Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం

Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

DK SrinivaS Arrest :  డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Stock Market News: సెన్సెక్స్‌ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!

Stock Market News: సెన్సెక్స్‌ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!