By: ABP Desam | Updated at : 04 Apr 2022 09:29 AM (IST)
నూజివీడులో అగ్ని ప్రమాదం
Fire broke out at Vanitize Threads Company: ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విన్టేజ్ స్పిన్నర్స్ ప్రయివేట్ లిమిటెడ్ స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించి మంటలు ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 5500 బ్లేడ్స్ అగ్నికి ఆహుతి కాగా, దాదాపు 30 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతోంది. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాత్రి పూట జరగడంతో భారీ నష్టం..
కొత్త జిల్లా అయితే ఇది ఏలూరు పరిధిలోకి వస్తుంది. పాత జిల్లా అయితే కృష్ణా జిల్లా నూజివీడు (fire broke out at Vanitize Threads Company in Nuziveedu) కిందకి వస్తుంది. రాత్రి పూట ప్రమాదం జరగడంతో నష్టం అధికంగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దారాల కంపెనీలో ఒకచోట మొదలైన మంటలు కొంత సమయానికే కార్చిచ్చుగా మారి మంటలు ఎగసి పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటి నుంచి ఏపీలో 13 జిల్లాలు 26 జిల్లాలుగా అమలులోకి రానున్నాయి. 13 కొత్త జిల్లాల నుంచి ఏపీ ప్రభుత్వం పాలన సాగించనున్నట్లు ఇదివరకే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: AP New Districts: కొద్దిసేపట్లో అమల్లోకి కొత్త జిల్లాలు, ముహూర్తం ఇదీ - సందేశం ఇవ్వనున్న సీఎం
Women Deaths: ఖమ్మంలో ఇంటర్ స్టూడెంట్ మృతి- విశాఖలో నగ్నంగా కనిపించిన మహిళ డెడ్ బాడీ!
Hyderabad News: కుప్పకూలిన బతుకులు, స్లాబ్ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
Telangana: ఇటుక లోడ్ ట్రాక్టర్ బోల్తా, చెక్ చేసిన పోలీసులు షాక్- 5 క్వింటాళ్ల గంజాయి లభ్యం
ACB Raids: ఏసీబీ మెరుపుదాడులు - రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో, ఆర్ఐ
IND Vs AUS: వార్ వన్‌సైడ్ - రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగులతో భారత్ విజయం!
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?
/body>