అన్వేషించండి

Crime News: పుచ్చకాయల్లో డ్రగ్స్ సరఫరా, అనుమానం వచ్చి పోలీసులు చెక్ చేయగా!

నకిలీ పుచ్చకాయల ద్వారా 5 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మెథాంఫేటమిన్‌ను అమెరికా కస్టమ్స్, అమెరికా బోర్డర్ ప్రొటెక్షన్ పోలీసులు కనుగొన్నారు. వాటి విలువ 5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా

Drugs Illegal Delivery through Watermelons | పుచ్చకాయల ద్వారా 5 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మెథాంఫేటమిన్ను అమెరికా కస్టమ్స్, అమెరికా బోర్డర్ ప్రొటెక్షన్ పోలీసులు కనుగొన్నారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో మొత్తం 1220 ప్యాకేజీల ద్వారా రెండు టన్నులకు పైగా బరువున్న క్రిస్టల్ మిత్ అని పిలవబడే మెథాంఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు బోర్డర్ ప్రొటెక్షన్ పోలీస్ (CBP) తమ ఎక్స్ అకౌంట్, పత్రికా ప్రకటనల ద్వారా వెల్లడించారు. ఆకుపచ్చ పుచ్చకాయల వలే కనిపించే ప్యాకేజీలలో చుట్టబడినట్టు వారు తెలియజేశారు. శాన్ డియాగో పోర్ట్ ఒటే మెసా వద్ద ఆ పుచ్చకాయలను తరలిస్తున్న ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

పార్సిల్లలో మెథాంఫేటమిన్
అమెరికా- మెక్సికో సరిహద్దులో ఒటే మెసాలో ట్రైలర్ను లాగుతున్న ట్రక్కును అధికారులు ఆపినట్లు US CBP తెలిపింది. 29 ఏళ్ల డ్రైవర్ పుచ్చకాయల షిప్మెంట్ను రవాణా చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే ఒక తనిఖీలో పార్సెల్లలో మెథాంఫేటమిన్ ఉన్నట్లు తేలింది. 
దీంతో CBP అధికారులు మాదక ద్రవ్యాలతోపాటు, వాణిజ్య ట్రాక్టర్-ట్రైలర్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను తదుపరి విచారణ కోసం హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ కస్టడీకి అప్పగించారు. 

ది గార్డియన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వారం క్రితమే అదే సరిహద్దు క్రాసింగ్లో దాదాపు 300 కిలోల మెత్ను తరలిస్తుండగా పోలీసులు కనుగొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ కాలిఫోర్నియాలో స్క్వాష్ రవాణాలో 6 టన్నుల మెత్ కూడా కనుగొన్నారు. గతేడాది మెక్సికో సరిహద్దు మీదుగా రవాణా చేస్తున్న జలపెనో పేస్ట్ డబ్బాలలో మెత్, కొకైన్ కనుగొన్నారు. పచ్చి బఠానీలు, పంచదార, పిండి, ఇతర స్వీట్ల రవాణాలో మాదక ద్రవ్యాలను దాచి సరఫరా చేస్తున్నట్టు ది గార్డియన్ పత్రిక కథనం ప్రకారం తెలుస్తోంది. 

 ఈ మాదక ద్రవ్యాలపై నిఘా, నిరోధం కోసం ఆపరేషన్ అపోలో ప్రారంభించారు. ఈ ఆపరేషన్ గత అక్టోబర్లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమై ఏప్రిల్లో అరిజోనాకు విస్తరించింది. మాదకద్రవ్యాల సరఫరా, నిల్వలో నింధితులు అధునాతన మార్గాలను అనుసరిస్తున్నట్టు పోర్ట్ డైరెక్టర్ రోసా హెర్నాండెజ్ తెలిపారు. ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు తాము కూడా మెరుగైన మార్గాలను కనుగొనడం జరుగుతుందని ఆయన వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Embed widget