News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య, ఎగ్జామ్ రాసి బాత్రూమ్ కు వెళ్లి!

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్ లో చున్నితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

FOLLOW US: 
Share:

Basara IIIT Student Commits Suicide: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయుసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లాకి చెందిన వడ్ల దీపిక వార్షిక పరీక్షలు రాసింది. అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలికలు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు చూసేసరికి చున్నితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు దీపిక మృతి చెందినట్ల ధ్రువీకరించారు. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్యపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నారాయణ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి
మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన 16 ఏళ్ల రాగుల వంశిత అనే విద్యార్థిని వారం క్రితమే నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో జాయిన్ చేశారు. అయితే వంశిత ఈరోజు అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. విషయం గుర్తించిన విద్యార్థినులు అక్కడే ఉన్న వార్డెన్లు, ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే  కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పై నుండి దూకిందా, లేక ఇతర కారణాలు వల్ల ఏమైనా చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. 
జూన్ 5వ తేదీ నుంచి బీడీఎస్ స్టూడెంట్ మృతి
వరంగల్ జిల్లాకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి సమీపంలో ఉన్న హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది మానస. ఇది గమనించి విద్యార్థినులు హాస్టల్ నిర్వాహకులకు చెప్పారు. వారు మానస గది తలుపులు బద్దలుకొట్టి  లోపలికి వెళ్లే సమయానికే జరగకూడదని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి మానస చనిపోయినట్లు నిర్ధారించారు. 

హైదరాబాద్ లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. భరత్ నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థి జూన్ ఏడవ తేదీ రాత్రి 7:30 గంటలకు ఉరి వేసుకుని విద్యార్థిని నవ్య ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ కూతురుది ఆత్మహత్య కాదని ఎవరో ప్రతి రోజు రాత్రి ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు చేశారని అందువల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా తమ ఇంటి ముందు నిమ్మకాయలు, అగరుబత్తులు, కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యుల ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసుకుని కుల్సుంపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published at : 13 Jun 2023 04:21 PM (IST) Tags: ABP Desam breaking news

ఇవి కూడా చూడండి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?