అన్వేషించండి

Bapatla Crime : బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం, మూడు నెలలుగా బెదిరిస్తూ అఘాయిత్యం!

Bapatla Crime : ఏపీలో ఓ గ్రామ వాలంటీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు నెలలుగా ఓ బాలికను బెదిరిస్తూ అత్యాచారం చేస్తున్నాడు. చివరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Bapatla Crime : ఏపీలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. తాజాగా ఓ గ్రామ వాలంటీర్ బాలికపై మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో బాలిక(15)పై గ్రామ వాలంటీర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం మరో గ్రామంలో ఉంటున్నారు. అమ్మమ్మతో కలిసి బాలిక ఈ గ్రామంలో ఉంటుంది. వాలంటీర్‌గా పనిచేస్తున్న వివాహితుడు రావిపాటి కోటయ్య బాలికను బెదిరిస్తూ గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చివరకు ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రావిపాటి కోటయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

బాలికపై వృద్ధుడి అత్యాచారం

చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసికందుల వద్ద నుండి పండు ముసళ్ళు వరకూ వావివరుస అనే తేడా లేకుండా మృగాళ్లు తమ కామావాంఛ తీర్చుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చి, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం‌ లేదు. ఏదో ఒక మూల ఏదో విధంగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వృద్దుడు 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్ళితే చిత్తూరు జిల్లా కేంద్రంలోని సీబీ రోడ్డులో నివాసం ఉండే ధనపాల్ అనే 58 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రోజువారి కూలీ‌ పనులు చేసుకుంటూ ధనపాల్ జీవనం సాగించేవాడు. కూలీ పనులు పూర్తి అయ్యాక మద్యం సేవించి ఇంటికి చేరుకన్న ధనపాల్ కుటుంబ సభ్యులతో తరచూ గొడవకు దిగేవాడు. దీంతో కుటుంబ సభ్యులు ధనపాల్ ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే కుటుంబానికి దూరంగా ఉండడంతో తన ఇంటికి సమీపంలో ఉండే తొమ్మిదేళ్ళ బాలికపై ధనపాల్ కన్నేశాడు. ఈ క్రమంలో యథావిధిగా గత రెండు రోజుల క్రితం కూలీ పనులకు వెళ్ళిన ధన్ పాల్ అర్థాంతరంగా కూలీ ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. 

మద్యం సేవించి

అటు తరువాత ఫూటుగా మద్యం సేవించి ధనపాల్ ఇంటికి వెళ్ళే సమయంలో తొమ్మిదేళ్ళ బాలిక కనిపించింది. బాలికతో మాటమాట కలిసి తినుబండాలు కొని  ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పాడు. తాగిన మైకంలో మనవరాలి వయస్సులో ఉన్న బాలికను ఇంటికి సమీపంలో ఉన్న పొదల మాటుకు తీసుకెళ్ళి తాకరాని చోటు ముట్టుకుని అభం శుభం తెలియని బాలికపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ధనపాల్ వికృత చేష్టలను భరించలేని బాలిక గెట్టిగా కేకలు వేస్తూ వృద్దుడి‌ నుండి తప్పించుకుని పొదల నుండి ఇంటికి‌ పరుగులు తీసింది. బాలిక కేకలు విన్న స్ధానికులు ఘటన స్ధలంకు చేరుకుని ధనపాల్ దేహశుద్ది చేసి చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ధనపాల్ ను అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget