Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!
Nancy Crampton Brophy : కొన్నిసార్లు మనం రాసిన, చదివిన పుస్తకాలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. "హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్" అనే పుస్తకం రాసిన రచయిత భర్త హత్య కేసులో అరెస్టు అయింది.
Nancy Crampton Brophy : 'భర్తను ఎలా చంపాలి' అని పుస్తకం రాసిన రచయిత్రి ఇప్పుడు భర్తను హత్య చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటుంది. అమెరికాలో ఈ ఘటన వెలుగుచూసింది. అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన నాన్సీ క్రాంప్టన్ బ్రాఫీ(71), 'రాంగ్ నెవర్ ఫెల్ట్ సో రైట్' అనే పేరుతో కొన్ని నవలలు రాసింది. ఇందలో "హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్" అనే శీర్షికతో ఓ పుస్తకం రాసింది. ఇది క్లాసిక్ డిటెక్టివ్ ఫిక్షన్ తో పాటు భారీ బీమా చెల్లింపు, నేరస్థుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు కనిపించే నిఘా ఫుటేజ్ ఇవి నవలా రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రాఫీ తాజా పుస్తకం కథాంశం కాదు. ఒరెగాన్ కోర్టు గదిలో ఆమె నిజ జీవితం. క్రాంప్టన్ బ్రాఫీ "రాంగ్ నెవర్ ఫెల్ట్ సో రైట్" నవలల సిరీస్‌లో "ది రాంగ్ హస్బెండ్", "ది రాంగ్ లవర్" నవలు రాసింది. అయితే తన భర్త డేనియల్ బ్రాఫీని ఆమె కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
బీమా డబ్బు కోసమే?
అయితే ఆమె ప్రస్తుతం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని, బీమా డబ్బుల కోసం భర్త డానియల్ బ్రాఫీని చంపేసిందని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అయితే తాను ఆ హత్య చేయలేదని ఆమె వాదిస్తోంది. ఈకామర్స్ వెబ్‌సైట్ ఈబేలో ఆమె ఒక గన్ బ్యారెల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె భర్త హత్య తర్వాత అది కనిపించకుండా పోవడంతో ఆమె అనుమానాలు మరింత బలపడ్డాయి. సరిగ్గా డానియల్ హత్య జరిగే సమయానికి, అతను పనిచేసే స్కూల్ దగ్గర నాన్సీ క్రాంప్టన్ బ్రాఫీ ట్రాక్ కనిపించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే తాను అక్కడకు వెళ్లినట్లు గుర్తులేదని ఆమె వాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా భర్త పేరిట చాలా ఇన్సూరెన్సులు కడుతూనే ఉందని, ఆ డబ్బు కోసమే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.
సీసీటీవీ పట్టించింది
జూన్ 2, 2018న ఒరెగాన్ క్యులినరీ ఇనిస్టిట్యూట్ వెలుపల క్రాంప్టన్ బ్రాఫీ మినీవ్యాన్‌ను దాదాపు సరిగ్గా స్కూల్ క్లాస్‌రూమ్‌లో ఆమె భర్త హత్యకు గురైన సమయంలో సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ రికార్డు అయిందని ప్రాసిక్యూటర్ షాన్ ఓవర్‌స్ట్రీట్ తెలిపారు. "ఎవరో మీ భర్తను కాల్చివేస్తున్న సమయంలో మీరు అక్కడ ఉన్నారు. ఆమె కొనుగోలు చేసిన తుపాకీ తర్వాత కనబడడంలేదు." అని అతను చెప్పారు.
క్రాంప్టన్ బ్రాఫీ కోర్టుకు ఆమె అక్కడ ఉన్నట్లు జ్ఞాపకం లేదని చెప్పింది. CCTV చిత్రాలు ఆ ప్రాంతంలో ఆమె ఉన్నట్లు నిరూపించాయి. డేనియల్ బ్రాఫీ(63) ఆ రోజు ఉదయం తరగతికి సిద్ధమవుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడ్ని రెండుసార్లు కాల్చారు. దీంతో డేనియల్ అక్కడికక్కడే మరణించాడు. హత్యకు ఉపయోగించిన గ్లోక్ హ్యాండ్‌గన్‌లోని బారెల్‌ను నిందితుడు ఈబేలో కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.