AIIMS Bhopal: ఎయిమ్స్ ఆస్పత్రి లిఫ్ట్‌లోనే చైన్ స్నాచింగ్ - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు - వైరల్ వీడియో
Chain theft in hospital lift: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిలో భద్రత లేకుండా పోయింది. లిఫ్ట్‌లోనే మహిళా ఉద్యోగిని మెడలో మంగళసూత్రం చోరీ చేశారు.

AIIMS Bhopal employee robbed of mangalsutra: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపేలా ఆదివారం సాయంత్రం ఒక ఘోరమైన దొంగతనం జరిగింది. ఆసుపత్రిలో అటెండెంట్‌గా పనిచేస్తున్న వర్షా సోనీ అనే మహిళా ఉద్యోగిని, తన విధి నిర్వహణలో భాగంగా బ్లడ్ బ్యాంక్ వెనుక ఉన్న లిఫ్ట్ ఎక్కినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ముసుగు ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించి లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు.
లిఫ్ట్ లోపల ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఏమీ తెలియనట్లుగా ఆమెతో మాట కలిపాడు. కంటి వైద్య విభాగం ఎక్కడ ఉందో చెప్పాలని ఆమెను అడిగి నమ్మకం కలిగించాడు. అయితే, లిఫ్ట్ మూడవ అంతస్తుకు చేరుకోగానే, తలుపులు తెరుచుకున్న తక్షణమే ఆ వ్యక్తి తన అసలు రూపాన్ని చూపించాడు. బయటకు వెళ్తున్నట్లు నటించి, ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని, ముత్యాల గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు.
Even AIIMS Bhopal isn’t safe. A woman was robbed inside a hospital elevator. No guard. CCTV caught it.
— Anurag Dwary (@Anurag_Dwary) January 26, 2026
Under BNS, robbery became "snatching"max 3 yrs, easy bail. Result? Snatching cases explode. Fear of law vanishes. pic.twitter.com/b4lwbHiFhf
ఈ ఆకస్మిక దాడితో షాక్‌కు గురైన వర్షా సోనీ అతడిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, దుండగుడు ఆమెను గట్టిగా వెనక్కి నెట్టేసి, మంగళసూత్రాన్ని తెంచుకుని మెట్ల మార్గం ద్వారా పరారయ్యాడు. పెనుగులాటలో ఆమె మెడలోని ముత్యాల గొలుసు తెగి కింద పడిపోయింది. ఈ మొత్తం దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కనీసం ఒక్క భద్రతా సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం.
AIIMS भोपाल में लिफ्ट के अंदर चेन स्नैचिंग!
— निशीकांत त्रिवेदी 🇮🇳 (@nishikantlive) January 27, 2026
महिला कर्मचारी से मंगलसूत्र लूटकर युवक फरार। हाई-सिक्योरिटी माने जाने वाले AIIMS Bhopal में भी सुरक्षा पर सवाल। CCTV वीडियो सामने आने के बाद हड़कंप। pic.twitter.com/k7PgBX6kV4
ఘటన తర్వాత బాధితురాలు భయాందోళనతో లిఫ్ట్ వద్దే కూర్చుని దాదాపు పది నిమిషాల పాటు రోదించారు. ఆ తర్వాత అటుగా వచ్చిన సెక్యూరిటీ గార్డ్ ఆమెను గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై బాఘ్‌సేవానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిమ్స్ వంటి ఆసుపత్రిలో, అది కూడా లిఫ్ట్ లోపలే ఇటువంటి ఘటన జరగడంపై ఆసుపత్రి సిబ్బంది మరియు రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















