అన్వేషించండి

Nalgonda News: సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే గర్భిణీ ప్రసవం - నల్గొండ జిల్లాలో ఘటన

Telangana News: నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భిణీ కుర్చీలోనే ప్రసవించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేశారు.

Pregnant Gives Birth In A Chair In Devarakonda: నల్గొండ జిల్లాలో (Nalgonda District) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భిణీ కుర్చీలోనే ప్రసవించిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్మ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణీకి గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు మూడో కాన్పు చేయడం కుదరదంటూ.. నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని పంపించారు. దీంతో ఆమెను అర్ధరాత్రి దాటిన తర్వాత నల్గొండ ఎంసీహెచ్‌లో చేర్చారు.

సిబ్బంది నిర్లక్ష్యం

అయితే, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెడ్ కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించలేదు. ఈ క్రమంలోనే ఆమెను నర్సులు బయట కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ప్రసవ వేదనతో బాధ పడుతూ అశ్వినీ కుర్చీలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కుర్చీ కింద తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రి సిబ్బంది హడావుడి చేస్తూ అమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిబ్బంది తీరుపై బంధువులు, ఇతర రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని.. నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త ఆంజనేయులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ వెంటనే ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అన్నారు.

Also Read: Hyderabad News: నగరంలో దారుణాలు - ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య, పెంచిన తల్లినే దారుణంగా చంపేసిన తనయుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget