అన్వేషించండి

Kerala Double Murder: ఓ దుర్మార్గుడి అరాచకం.. ఆ ఫ్యామిలీ అంతం

Crime News: కేరళలో డబుల్​ మర్డర్​ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ డబుల్​ మర్డర్​ ఘటనపై తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Kerala Crime News: కేరళలో డబుల్​ మర్డర్​ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దల మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాథలుగా మిగిలారు. అయితే ఈ డబుల్​ మర్డర్​ ఘటనపై తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందే ఆ కుటుంబంలోని మహిళను చంపిన నిందితుడు జైలుకు వెళ్లొచ్చి.. ఆ మహిళ భర్త, ఆమె అత్తను అతి కిరాతకంగా హత్య చేశాడు.

పక్కింట్లో ఉండే వ్యక్తే..
కేరళలోని పలక్కడ్​ జిల్లా నెన్​మారా పట్టణంలో సోమవారం వెలుగుచూసిన జంట హత్యలు కలకలం రేపాయి. సుధాకరణ్​(55), అతడి తల్లి లక్ష్మి(75) వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. పక్కింట్లో ఉండే చెంతమార(58) అనే వ్యక్తే వారిని హత్య చసి పరారయ్యాడని స్థానికులు ఆరోపించారు. అతడిని వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో పోలీసులు అతడి కోసం జల్లెడపట్టి ఎట్టకేలకు అరెస్ట్​ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మంత్రాలు చేయడంతో తన భార్య వెళ్లిపోయిందనే పగతో..
నిందితుడు చెంతమార, అతడు హత్య చేసిన మృతుల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. అయితే సుధాకరణ్​ కుటుంబం మంత్రాలు చేస్తోందని చెంతమారకు అనుమానం ఉండేది. వారి మంత్రాల కారణంగానే తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిందని నమ్మేవాడు. దీంతో సుధాకరణ్​ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. 2019లో సుధాకరణ్​ భార్య సుజితను హత్య చేశాడు. దీంతో అరెస్టైన చెంతమారా కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. కానీ అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు.

ఇంట్లోకి చొరబడి హత్య
కొంతకాలం క్రితం జైలు నుంచి బెయిల్​పై విడుదలైన చెంతమార.. సోమవారం సుధాకరణ్​ను, అతడి తల్లి లక్ష్మిని వారి ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారించగా.. సుధాకరణ్​ తనను చంపుతాడనే అనుమానంతో వారిని హత్య చేసినట్లు పేర్కొన్నాడు.

పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదు
ఇంటి పెద్దలను కోల్పోయిన సుధాకరణ్​ కూతుర్లు అఖిల, అతుల్య అనాథలుగా మిగిలారు. తమ తల్లిని చంపిన చెంతమార బెయిల్​పై వచ్చి పక్కింట్లోనే ఉంటుండడంతో.. మమ్మల్ని కూడా చంపేస్తాడని, అతడిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని, ఇప్పుడు అతడు తమ తండ్రి, నాయనమ్మను పొట్టనపెట్టుకున్నాడని ఆ ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని బోరున ఏడుస్తున్నారు. తమ కుటుంబాన్ని అంతం చేసిన నిందితుడు చెంతమారను ఉరితీయాలని డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే కొంత కాలానికి బెయిల్​పై వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తాడని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్​స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన 
నిందితుడు చెంతమార అరెస్టు వార్త స్థానికులు పోలీస్​స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గుడిని తమకు అప్పగించాలని, తామే వాడిని చంపేస్తామన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్​ చేపట్టి వారిని చెదరగొట్టారు. నేడు చెంతమారను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.. జంట హత్యల రీ కన్​స్ట్రక్షన్​ కోసం అతడిని నేరస్థలానికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget