Crime News : 2 వారాల కిందట పెళ్లి - భర్త, మామ కలిసి భార్య, అత్తను చంపేశారు !
కర్నూలు జిల్లాలో డబుల్ మర్డర్ చోటు చేసుకుంది. నన వధువు, ఆమె తల్లిని భర్త, బంధువులు కలిసి చంపేసారు.
Crime News : రెండు వారాల కిందటే పెళ్లయింది. కుమార్తెను అత్తారింటికి తీసుకు వచ్చింది తల్లి. కానీ అలా తీసుకు రావడమే తప్పయింది. ఎందుకంటే ఇప్పుడు కూతురితో పాటు ఆమె కూడా విగత జీవురాలయిది. ప్రమాదంలోనో మరో కారణంమతోనే వీరు ప్రాణాలు పోగొట్టుకోలేదు. వీరిని దారుణంగా హత్య చేశారు. ఈ హ త్యలు చేసింది కూడా ఎవరో కాదు.. రెండు వారాల కిందట పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. ఆయన తండ్రి. కాస్త విచిత్రంగా ఉన్న ఈ క్రైమ్ డబుల్ మర్డర్ స్టోరీ ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.
కర్నూలు జిల్లాలో కల్లూరులో ఓ యువతిని, ఆమె తల్లిని ఓ యువకుడు.. అతని తండ్రి దారుణంగా హత్య చేశారు. ఆవేశంలో నరికి హత్య చేశారు. ఆ యువతికి యువకుడితో రెండు వారాల కిందట పెళ్లి అయింది. యువతి స్వస్థతం మహబూబ్ నగర్ జిల్లా నవపర్తి. కర్నూలు జిల్లా కల్లూరులో మంచి సంబంధం అనుకుని రెండు వారాల కిందట పెళ్లి చేశారు. కుమార్తెను అత్తారింట్లో దింపడానికి తల్లి కూడా వచ్చింది. అయితే అక్కడ కుటుంబపరమైన గొడవలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా ఇవి తీవ్ర రూపం దాల్చడం... యువతి, ఆమెతల్లి అన్ని సమస్యలకూ కారణం అవుతున్నారన్న ఉద్దేశంతో కొత్త పెళ్లి కొడుకు... ఆయన తండ్రి ఆవేశానికి గురై పెళ్లి కుమార్తెను, ఆమె తల్లిని కూడా నరికి చంపినట్లుగా తెలుస్తోంది.
నవ వధువు భర్త , మాత కలిసి చంపేయడం సంచలనం సృష్టించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి.. రెండు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో ప్రశ్నిస్తున్నారు. పెళ్లి సమయంలో జరిగిన గొడవలు అంతకంతకూ పెద్దవై ఇవి హత్యకు దారి తీశాయన్న వాదన వినిపిస్తోంది. తమ కుటుంబంలో మహిళలు ఇద్దర్నీ కొత్తగా సంబంధం కలుపుకున్నవారు హత్య చేయడంతో.. ఆ మహిళల కుటుంబం షాక్ కు గురైంది. అసలేం జరిగిందో వారు చెప్పలేకపోతున్నారు.
కుటంబ పరమైన సమస్యలు ఉంటే... హత్యల ద్వారా పరిష్కారించుకోవడం ఏమిటన్న విస్మయం ఈ ఘటన ద్వారా వ్యక్తమవుతోంది. రెండు వారాల కందట పెళ్లి చేసుకున్న వారు.. వరకట్నం పేరుతో హత్యలు చేస్తూంటారు కానీ..ఇలా అమ్మాయితో పాటు ఆమె తల్లిని కూడా చంపడం సంచలనంగా మారింది. ఈ హత్యలకు కట్నాలు కారణమా... లేక... మరో సమస్యనా అన్నది తేలాల్సి ఉంది. కారణం ఏదైనా రెండు ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయాయి.