అన్వేషించండి

Viral Crime: ఐఫోన్, రీల్స్ కోసం హత్యలు కూడా చేస్తున్న పిల్లలు - ఇలాంటి ఘోరాలు ఇంకెన్నిచూడాలో ?

iPhone Murder: రీల్స్ మంచి క్వాలిటీగా తీయాలని ఐ ఫోన్ దొంగతనం చేయాలనుకున్నారు . ఇందు కోసం ఐ ఫోన్ ఉన్న వ్యక్తిని చంపేశారు ఇద్దరు పిల్లలు.

2 Minors Slit Man Throat to Steal iPhone: సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది పిల్లలు దారి తప్పి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలు కూడా చేస్తున్నారు. క్వాలిటీ రీల్స్ తీసుకోవడానికి తమకు ఓ ఐ ఫోన్ కావాలనుకున్న ఇద్దరు పిల్లలు.. అలాంటి ఫోన్ వాడుతున్నయువకుడ్ని అత్యంత ఘోరంగా గొంతు కోసి హత్య చేశారు. ఆ ఫోన్ చోరీ చేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది. 

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని నగరౌర్ గ్రామంలో  షాదాబ్ 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని ఫోన్ చోరీ కి గురయింది. ఫోన్ ట్రేస్ చేసి.. ఆ ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులుకనిపెట్టారు. దాంతో హత్య కేసు చిక్కుముడి కూడా వీడిపోయింది. కానీ ఆ నేరం చేసిన వారిని.. వారు ఎందుకు ఆ నేరం చేశారో తెలుసుకుని పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. 

19 ఏళ్ల షాదాబ్ ను హత్య చేసింది  14 , 16 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు.   ఇద్దరు మైనర్లు షాదాబ్ గొంతు కోసి హత్య చేసి, అతని తలను రాయితో నలిపి అతని ఐఫోన్‌ను దొంగిలించారు. ఎందుకంటే  మరిన్ని లైక్‌ల కోసం "అధిక-నాణ్యత రీల్స్"  చేసేందుకు. 
  
బెంగళూరులో నివసించిన బాధితుడు షాదాబ్ (19), తన మామ వివాహం కోసం బహ్రైచ్‌లోని తన పూర్వీకుల గ్రామం నాగౌర్‌కు వచ్చాడు.అయితే అతను హటాత్తుగా కనిపించకుండా  పోయాడు.  షాదాబ్ జూన్ 21న తప్పిపోయినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ తర్వాత రోజు   గ్రామం వెలుపల ఉన్న జామ తోటలో శిథిలావస్థలో ఉన్న గొట్టపు బావి సమీపంలో అతని మృతదేహం కనిపించింది.   షాదాబ్ గొంతును కత్తితో కోసి, అతని తలపై రాయితో కొట్టి చంపేశారు. 

పెద్దగా  కష్టపడకుండా  నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ మైనర్లు.  విచారణ సమయంలో బాలురు యువకులు నేరాన్ని అంగీకరించారు. మెరుగైన రీల్స్ తయారు చేయడానికి తమకు అధిక నాణ్యత గల మొబైల్ ఫోన్ అవసరమని చెప్పారు. వారు నాలుగు రోజుల ముందు హత్యను ప్లాన్ చేసినట్లు అంగీకరించారు. షాదాబ్ వద్ద ఐ ఫోన్ ఉండటంతో  లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. 

 సంఘటన జరిగిన రాత్రి, వారు రీల్స్ తయారు చేద్దామని చెప్పి  షాదాబ్‌ను గ్రామం వెలుపల ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ, వారు అతనిపై దాడి చేసి, అతని గొంతు కోసి చంపారు.  పోలీసులు షాదాబ్ ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్ నిందితులు , వారి కుటుంబ సభ్యులతో సహా నలుగురు వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1) (హత్య) మరియు 238 (సాక్ష్యాలను దాచడం) కింద కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని కనుగొన్న తర్వాత మైనర్లు , వారి కుటుంబ సభ్యులు మొదట్లో ఇళ్ల నుండి పారిపోయినప్పటికీ వెంటనే వారి ఆచూకీ ట్రేస్ చేసి అరెస్టు  చేశారు.  ఆయుధాన్ని దాచడానికి సహాయం చేశాడని  నిందితుడి బంధువులలో ఒకరిని శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపారు.   

 

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget