Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Crime News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎన్‌సీబీ, ఏటీసీ అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో రూ.1,800 కోట్లకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Drugs Seized In Bhopal: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజధాని నగరం సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో రూ.1,800 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్షసంఘవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యాక్టరీలో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం అందడంతో.. గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో (ATC) కలిసి సంయుక్తంగా రైడ్ చేశారు. ఈ క్రమంలోనే ఎండీ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!
— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024
Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!
This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA
దీని విలువ దాదాపు రూ.1,800 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీలో మరింత ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంత్రి హర్ష సంఘవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'ఎన్‌సీబీ, ఏటీఎస్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఆరోగ్యకర సమాజం కోసం అధికారులు ఎంతగానో శ్రమిస్తున్నారు. భారత్‌ను సురక్షితంగా ఉంచేందుకు నిర్విరామంగా శ్రమిస్తాం.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: Dantewada Encounter: దంతేవాడ ఎన్‌కౌంటర్‌లో ఆ అగ్రనేతలు మిస్, కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీలు