అన్వేషించండి

Dantewada Encounter: దంతేవాడ ఎన్‌కౌంటర్‌లో ఆ అగ్రనేతలు మిస్, కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీలు

Chhattisgarh Dantewada Encounter: ఇటీవల ఛత్తీస్ ఘడ్ పోలీసులు, ఇతర బలగాల సాయంతో దంతేవాడ సరిహద్దులో జరిపిన భారీ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు చనిపోలేదని సమాచారం వచ్చింది.

Maoists Killed in Dantewada Encounter: ఈ భారీ ఎన్ కౌంటర్‌లో చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పోలీసులు ఊహించినట్లు, ప్రచారం జరిగినట్లు అగ్రనేతలు ఎవరు మృతి చెందలేదు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి  నంభాల కేశవరావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కల్లపల్లి వాసుదేవరావు మృతి చెందారని ప్రచారం జరిగింది. కానీ ఛత్తీస్ ఘడ్ పోలీసులు ఎదురుకాల్పులు, మృతుల వివరాలు తెలిపిన తరువాత ఈ ఇద్దరు నేతలు లేరని తేలిపోయింది.

ఆ ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు సేఫ్

నాంబాల కేశవరావు, తక్కల్లపల్లి వాసుదేవ రావులకు వరంగల్ జిల్లాకు సంబంధాలు ఉన్నాయి. నాంబాల కేశవరావు వరంగల్ నగరంలోని అప్పటి అర్ ఈ సీ, ఇప్పటి ఎన్ ఐ టీ లో బీటెక్ పూర్తి చేసి పీపుల్స్ వార్ బాట పట్టారు. నంబాల కేశవరావు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జియ్యాన్నపేట గ్రామం. తక్కల్లపల్లి వాసుదేవ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు వేంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామం. ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘకాలంగా మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై పనిచేస్తున్నారు. వీరి మృతి చెందారని ప్రచారం జరగడంతో  హక్కుల సంఘాలు, మావోయిస్టు సానుభూతి సంఘాలు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి వివరాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశాయి. కానీ చనిపోయిన వారిలో కేశవరావు, వాసుదేవరావు లేక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

దంతేవాడ డీఐజీ కమ్లోచన్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘భారీ ఎన్ కౌంటర్ తర్వాత నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తూర్పు బస్తర్ డివిజన్‌లోని మావోయిస్టులలో భయానక వాతావరణం నెలకొంది. నక్సలైట్ల అగ్ర నాయకత్వం ఈ ప్రాంతాన్ని తమ సురక్షిత ప్రాంతంగా భావించేది. కానీ తాజా ఆపరేషన్ తరువాత, నక్సలైట్ నాయకత్వం తమ క్యాడర్ ను, స్థానికులను నిందిస్తోందని తెలిపారు.    

ఈ ఏడాది నారాయణపూర్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇప్పటివరకు మొత్తం 44 మంది మావోయిస్టులు మరణించినట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. మరో 29 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా.. మరో 47 మంది మావోయిస్టులు పోలీసుల సూచనలతో లొంగిపోయారని చెప్పారు. 

బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పి. మాట్లాడుతూ.. నిషేధిత, చట్ట విరుద్ధమైన సిపిఐ మావోయిస్టు సంస్థపై చర్యలు తీసుకునేందుకు, డిఆర్‌జి, కేంద్ర పారామిలటరీ బలగాలు, స్థానిక జిల్లా పోలీసు బలగాలు సమన్వయంతో, వ్యూహంతో పని చేయాలన్నారు. 2024లో బస్తర్ డివిజన్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో 188 మంది నక్సలైట్లు మృతిచెందారు. మరో 706 మందిని అరెస్టు చేయగా, 733 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

2024లో మావోయిస్టు అగ్ర నాయకత్వానికి భద్రతా దళాలు భారీ నష్టాన్ని కలిగించాయని సుందర్‌రాజ్ పి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ DKSZC జోగన్న పెద్దపల్లి జిల్లా, DKSZC రంధర్, వరంగల్ జిల్లా, DKSZC రూపేష్, గడ్చిరోలి జిల్లా మహారాష్ట్ర, TSC సభ్యుడు CRC 02 కమాండర్ సాగర్ భూపాలపల్లి జిల్లా, DVCM శంకర్ రావు, భూపాలపల్లి జిల్లా, DVCM వినా వరంగల్ జిల్లా, DVCM జగదీష్, బాలాఘాట్ జిల్లా మధ్యప్రదేశ్,  ACM సంగీత అలియాస్ సన్నీ, గడ్చిరోలి జిల్లా మహారాష్ట్ర, ACM లక్ష్మి, మల్కన్‌గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రం, ACM రజిత వరంగల్ జిల్లా తెలంగాణకు చెందిన ఇతర రాష్ట్రాల నంచి వచ్చిన సీనియర్ మావోయిస్టు క్యాడర్ పలు ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Telangana News: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Telangana News: తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
తెలంగాణలో పండుగ పూట తీవ్ర విషాదాలు - పిడుగు పడి ఇద్దరు, రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Ben Stokes: దొంగ గారూ ప్లీజ్ - బతిమాలుకుంటున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ! ఎంత కష్టం వచ్చిందంటే ?
దొంగ గారూ ప్లీజ్ - బతిమాలుకుంటున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ! ఎంత కష్టం వచ్చిందంటే ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Karnataka: కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ
కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ
KA Movie Sequel: కిరణ్ అబ్బవరం సినిమాకు సీక్వెల్ కన్ఫర్మ్... 'క 2'కు టైటిల్ కూడా ఫిక్స్!
కిరణ్ అబ్బవరం సినిమాకు సీక్వెల్ కన్ఫర్మ్... 'క 2'కు టైటిల్ కూడా ఫిక్స్!
Embed widget