News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Torrent Pharma: వీక్‌ మార్కెట్‌లోనూ వండ్రఫుల్‌ ర్యాలీ, షేక్‌ చేసిన టోరెంట్‌ ఫార్మా

ఇవాళ్టి బేరిష్‌ మార్కెట్‌లోనూ పాజిటివ్‌ సెంటిమెంట్‌ క్రియేట్‌ చేశాయి, NSEలో దాదాపు 8% పెరిగాయి.

FOLLOW US: 
Share:

Torrent Pharma shares: ఇవాళ (బుధవారం, 31 మే 2023), స్టాక్‌ మార్కెట్లు వీక్‌గా ఉన్నా టోరెంట్‌ ఫార్మా షేర్లు రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి ఎగిరాయి. 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ లాభాలను ప్రకటించింది. అయితే, గత ఏడాది ఇదే కాలంలోని నష్టాల నుంచి పుంజుకుని తిరిగి లాభాల్లోకి రావడం ఇక్కడ విశేషం. దీంతో, టోరెంట్‌ ఫార్మా షేర్లు ఇవాళ్టి బేరిష్‌ మార్కెట్‌లోనూ పాజిటివ్‌ సెంటిమెంట్‌ క్రియేట్‌ చేశాయి, NSEలో దాదాపు 8% పెరిగాయి.
 
టోరెంట్ ఫార్మా, 2023 మార్చి క్వార్టర్‌ రిజల్ట్స్‌ను నిన్న (మంగళవారం, 30 మే 2023) ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 287 కోట్ల పన్ను తర్వాతి ఏకీకృత లాభాన్ని (PAT) ప్రకటించింది. ఈ ఫార్మా కంపెనీ అమ్మకాలు అన్ని మార్కెట్లలోనూ బలంగా ఉన్నాయి. సరిగ్గా ఏడాది క్రితం, అంటే 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ ఔషధ సంస్థ రూ.118 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది.

ఏడాది ప్రాతిపదికన, కంపెనీ ఆదాయం రూ. 2,131 కోట్ల నుంచి పోలిస్తే రూ. 2,491 కోట్లకు పెరిగింది.

ఒక్కో షేరుకు రూ. 8 చొప్పున తుది డివిడెండ్‌ ఇవ్వడానికి కూడా టోరెంట్‌ ఫార్మా డైరెక్టర్ల బోర్డ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

మధ్యాహ్నం 2 గంటల సమయానికి టోరెంట్‌ ఫార్మా షేర్లు 4.75% లాభంతో రూ. 1,795 వద్ద కదులుతున్నాయి. గత ఆరు నెలల కాలంలో ఈ స్టాక్‌ 8% పైగా లాభపడింది. గత ఒక ఏడాది కాలంలో దాదాపు 27% ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) చూస్తే, దాదాపు 16% రిటర్న్‌ ఇచ్చింది.

ఈ స్టాక్‌ను ట్రాక్‌ చేస్తున్న కొన్ని బ్రోకరేజీ సంస్థలు, Q4 ఆదాయాల ఆధారంగా వివిధ రేటింగ్స్‌ ప్రకటించాయి.

టోరెంట్‌ ఫార్మా స్టాక్‌కు బ్రోకరేజ్‌లు ఇచ్చిన టార్గెట్‌ ప్రైస్‌లు:

కోటక్ సంస్థాగత ఈక్విటీస్‌ ఇచ్చిన రేటింగ్‌: రెడ్యూస్‌ | టార్గెట్ ప్రైస్‌: రూ. 1,645

మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చిన రేటింగ్‌: న్యూట్రల్‌ | టార్గెట్ ప్రైస్‌: రూ. 1,650
TRPని 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలకు 26 రెట్ల వద్ద విలువ కట్టి, రూ. 1,650 టార్గెట్ ధర ఇస్తున్నట్లు బ్రోకరేజ్‌ వెల్లడించింది.

నువామా ఇచ్చిన రేటింగ్‌: బయ్‌ | టార్గెట్ ప్రైస్‌: రూ. 1,980
Q4 ఫలితాలకు ముందు కూడా నువామా బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది. రూ. 1,980 టార్గెట్‌ ధరతో సేమ్‌ కాల్‌ని ఫలితాల తర్వాత కూడా కంటిన్యూ చేసింది.

ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన రేటింగ్‌: బయ్‌ | టార్గెట్ ప్రైస్‌: రూ. 1,900
Q4 ఫలితాలకు ముందు రూ. 1,820 టార్గెట్‌ ధరతో బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ హౌస్‌, ఫలితాల తర్వాత టార్గెట్‌ ధరను రూ. 1,900కి అప్‌గ్రేడ్‌ చేసింది, బయ్‌ కాల్‌ కంటిన్యూ చేసింది.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: జెట్‌ స్పీడ్‌లో పెరిగిన సూపర్‌ స్టాక్స్‌, మళ్లీ ఇదే రిపీట్‌ అవ్వొచ్చు!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 31 May 2023 02:18 PM (IST) Tags: share price dividend Torrent Pharma Q4 earnings

ఇవి కూడా చూడండి

Cryptocurrency Prices : బిట్‌కాయిన్‌ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్‌

Cryptocurrency Prices : బిట్‌కాయిన్‌ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్‌

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

FD Rates: రెండు స్పెషల్‌ స్కీమ్స్‌ను క్లోజ్‌ చేసిన HDFC బ్యాంక్‌, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే

FD Rates: రెండు స్పెషల్‌ స్కీమ్స్‌ను క్లోజ్‌ చేసిన HDFC బ్యాంక్‌, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Investment Tips: 30-40 ఏళ్ల వయస్సులో పాటించాల్సిన బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజీ, మీ టార్గెట్‌ మిస్‌ కాదు!

Investment Tips: 30-40 ఏళ్ల వయస్సులో పాటించాల్సిన బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజీ, మీ టార్గెట్‌ మిస్‌ కాదు!

టాప్ స్టోరీస్

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌