Multibagger Stocks: జెట్ స్పీడ్‌లో పెరిగిన సూపర్ స్టాక్స్, మళ్లీ ఇదే రిపీట్ అవ్వొచ్చు!
గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో పెట్టుబడిదార్ల డబ్బును 5-20 రెట్లు పెంచాయి.
Investment Tips: తప్పతాగిన వ్యక్తి తరహాలోనే మన స్టాక్ మార్కెట్ కూడా తడబడుతూ నడుస్తోంది. కాబట్టి, స్టాక్ మార్కెట్‌లో భవిష్యత్ రాబడిని ఎవరూ ఊహించలేరు. అయితే, గత 4 ఆర్థిక సంవత్సరాల్లో 350% పైగా రిటర్న్ ఇచ్చాయి 4 సూపర్ స్టాక్స్. రూ.1,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, దలాల్ స్ట్రీట్ అద్భుతమైన షో చూపించాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో పెట్టుబడిదార్ల డబ్బును 5-20 రెట్లు పెంచాయి. ఆ మల్టీబ్యాగర్స్ ఇదే వేగాన్ని భవిష్యత్‌లోనూ కనబరచవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
4 మల్టీబ్యాగర్ స్టాక్స్:
గుజరాత్ థెమైస్ బయోసిన్ - Gujarat Themis Biosyn
గత 4 ఆర్థిక సంవత్సరాల కాలంలో, ఈ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్ 1,904% ర్యాలీ చేసింది. Rifamycin S & Rifamycin O అనే రెండు APIలను తయారు చేస్తోందీ కంపెనీ. FY23లో దీని ఆదాయం 29.7% పెరిగి రూ. 149 కోట్లకు చేరుకుంది. PAT 33% పెరిగి రూ. 58 కోట్లకు చేరుకుంది. ఇది వ్యాపారాన్ని పెంచుకునే ఆలోచనలో ఉంది, ఇందుకోసం రూ. 200 కోట్ల క్యాపెక్స్ చేస్తోంది.
బ్రోకరేజ్ HDFC సెక్యూరిటీస్, FY22-25 కాలంలో గుజరాత్ థెమైస్ బయోసిన్ ఆదాయం, ఎబిటా, లాభం వరుసగా 29%, 28%, 27% CAGR వద్ద పెరుగుతుందని అంచనా వేసింది.
అయాన్ ఎక్స్ఛేంజ్ (ఇండియా) - Ion Exchange (India)
నీరు, పర్యావరణ నిర్వహణలో ప్రత్యేకత కలిగిన ముంబైకి చెందిన కంపెనీ ఇది. సుప్రసిద్ధ స్టాక్ పికర్ సునీల్ సింఘానియా ఫండ్‌కు ఈ సంస్థలో 3.27% వాటా ఉంది. గత నాలుగేళ్లలో ఈ స్టాక్ 892% పెరిగింది.
తగ్గుతున్న భూగర్భ జలాల వల్ల, నీటిని సరిగ్గా వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది, వాటర్ ట్రీట్‌మెంట్ కెమికల్స్ వ్యాపారానికి బూస్ట్ అందిస్తుంది. ఈ కారణంగా, రాబోయే సంవత్సరాల్లో అయాన్ ఎక్స్ఛేంజ్ ఉత్పత్తులకు బలమైన డిమాండ్, ఆదాయం పెరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ HDFC అంచనా వేసింది.
జేబీ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ - JB Chemicals & Pharmaceuticals
ఇది BSE500 స్టాక్. గత 4 సంవత్సరాల్లో 5 రెట్లు పెరిగింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గత సంవత్సరం కంటే 22% పెరిగింది. అదే కాలంలో, కంపెనీకి చెందిన దేశీయ ఫార్ములేషన్, కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ వ్యాపారం బలంగా వృద్ధి చెందింది. ఇది ఎక్కువ మార్జిన్ ఇచ్చే వ్యాపారం.
బ్రోకరేజ్ ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్‌కు రూ. 2,450 టార్గెట్ ధర ప్రైస్‌తో "బయ్" కాల్ ఇచ్చింది. మంగళవారం ఈ షేరు రూ. 2,117 వద్ద ముగిసింది.
టిమ్‌కెన్ ఇండియా - Timken India
టిమ్‌కెన్ ఇండియా వివిధ రకాల బేరింగ్స్, యాక్సెసరీస్ తయారు చేసి అమ్ముతుంది. గత 4 ఆర్థిక సంవత్సరాల్లో ఈ BSE500 స్టాక్ అద్భుతంగా పని చేసి 386% రాబడి అందించింది.
దేశీయ బ్రోకరేజ్ ICICI డైరెక్ట్, FY23-25 కాలంలో, ఈ కంపెనీ నుంచి 18% CAGR వద్ద ఆదాయ వృద్ధిని ఆశిస్తోంది. ఈ అంచనాకు అనుగుణంగా టిమ్‌కెన్ ఇండియా స్టాక్‌కు రూ. 3,740 టార్గెట్ ప్రైస్‌తో "బయ్" రేటింగ్ ఇచ్చింది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: దడ పుట్టించిన సిల్వర్ - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.