Tata Altroz: అల్ట్రోజ్‌లో కొత్త బడ్జెట్ వేరియంట్.. లాంచ్ త్వరలోనే!
ప్రముఖ కార్ల బ్రాండ్ టాటా తన అల్ట్రోజ్ మోడల్‌లో కొత్త వేరియంట్ త్వరలోనే లాంచ్ కానుంది.
టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బాక్ వెర్షన్‌లో ఆటోమేటిక్ వెర్షన్‌పై కంపెనీ ఎప్పటి నుంచో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో ఈ కారు ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు. ఇప్పుడు దీని కొత్తగా వార్తలు వస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ కారు లాంచ్ కానుందని తెలుస్తోంది.
2020లో లాంచ్ అయిన టాటా అల్ట్రోజ్ ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని వేరియంట్లలోనే మాన్యువల్ గేర్‌బాక్స్‌నే అందించారు. ఆటోమేటిక్ వెర్షన్‌ను కంపెనీ అప్పుడు లాంచ్ చేయలేదు.
అయితే త్వరలో లాంచ్ కానున్న ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. డీజిల్ వేరియంట్‌లో మాత్రం ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ లాంచ్ కాబోవడం లేదు. అల్ట్రోజ్ కోసం టాటా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డీసీటీ) కూడా రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి.
టాటా మోటార్స్.. అల్ట్రోజ్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ల కోసం డీసీటీని రూపొందించనుందని తెలుస్తోంది. టాటా అల్ట్రోజ్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్లు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ మోటార్, 1.2 లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్‌డ్ యూనిట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
వీటిలో 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 85 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ 108 బీహెచ్‌పీ, 140 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఈ రెండు కాంబినేషన్లలోనూ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను అందించారు.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?