Stocks To Watch 21 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Infosys, HUL, RIL
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 21 July 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 15 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్ కలర్‌లో 19,873 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్: రిలయన్స్ ఇండస్ట్రీస్, JSW స్టీల్, అల్ట్రాటెక్, Paytm, వేదాంత, HDFC లైఫ్, అశోక్ లేలాండ్ ఇవాళ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇన్ఫోసిస్: బలహీనంగా ఉన్న గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్ కారణంగా FY24లో తన ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ తగ్గించింది. తాజా అంచనా ప్రకారం, కంపెనీ ఆదాయం స్థిరమైన కరెన్సీ పరంగా కేవలం 1-3.5% వద్ద పెరగవచ్చు.
ఇండియామార్ట్ ఇంటర్‌మేష్: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 78% పెరిగి రూ. 83 కోట్లకు చేరుకుంది. రూ. 500 కోట్ల బైబ్యాక్‌కు కూడా కంపెనీ ఆమోదం తెలిపింది.
యునైటెడ్ స్పిరిట్స్: జూన్ త్రైమాసికంలో ఈ ఆల్కహాల్ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 477 కోట్లకు చేరింది, గత ఏడాది ఇదే కాలం కంటే 82% వృద్ధిని నమోదు చేసింది.
HUL: FY24 మొదటి త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్ 8% వృద్ధితో రూ. 2,472 కోట్ల స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ ఆర్జించింది. కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 7% పెరిగి రూ. 14,931 కోట్లకు చేరాయి.
పెర్సిస్టెంట్ సిస్టమ్స్: 2023-24 తొలి త్రైమాసికంలో రూ. 229 కోట్ల కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌ను పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 23% పెరిగి రూ. 2,321 కోట్లకు చేరుకుంది.
యూనియన్ బ్యాంక్: జూన్ త్రైమాసికంలో రూ. 3,236 కోట్ల నికర లాభాన్ని యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. NII రూ. 8,839 కోట్లకు చేరుకుంది.
టాటా మోటార్స్: టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ JLR, అడ్రియన్ మార్డెల్‌ను మూడేళ్ల కాలానికి CEOగా నియమించింది.
దాల్మియా భారత్: తొలి త్రైమాసికంలో రూ. 144 కోట్ల లాభాన్ని దాల్మియా భారత్ ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 3,624 కోట్ల ఆదాయం వచ్చింది.
తాన్లా ప్లాట్‌ఫామ్స్: ఈ కంపెనీ లాభం Q1లో 34% వృద్ధితో రూ. 135 కోట్లకు పెరిగింది. ఆదాయం 14% పెరిగి రూ.911 కోట్లకు చేరుకుంది.
కోఫోర్జ్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కోఫోర్జ్ రూ. 165 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే కాలానికి ఆదాయం రూ. 2,221 కోట్లుగా రికార్డ్ అయింది.
ఇది కూడా చదవండి: ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ గడువు మరో నెల పొడిగింపు?, నిర్మలమ్మకు రిక్వెస్ట్ లెటర్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial