Stocks To Watch 14 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Senco Gold, Wipro, JBM Auto
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 14 July 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 10 పాయింట్లు లేదా 0.05 శాతం రెడ్ కలర్‌లో 19,548 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ రిలీజ్ చేసే కంపెనీలు: బంధన్ బ్యాంక్, JSW ఎనర్జీ, జస్ట్ డయల్ ఇవాళ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
సెన్‌కో గోల్డ్: IPOలో వచ్చిన బలమైన సబ్‌స్క్రిప్షన్స్ నేపథ్యంలో, సెన్‌కో గోల్డ్ షేర్లు ఈ రోజు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. ప్రారంభమవుతాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల లెక్క ప్రకారం, సెన్‌కో గోల్డ్ IPO బలమైన ప్రీమియంతో, ఒక్కో షేర్ రూ. 450కు పైగా ధర దగ్గర లిస్ట్ కావచ్చు. లక్కీ అలాటీలకు కనీసం 40 శాతం లిస్టింగ్ గెయిన్స్ దక్కే అవకాశం ఉంది.
ఏంజెల్ వన్: 2023-24 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏంజెల్ వన్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 22% పెరిగి రూ. 221 కోట్లకు చేరుకుంది. మొదటి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం సంవత్సరానికి (YoY) 18% వృద్ధితో రూ. 807 కోట్లకు చేరింది.
విప్రో: ఐటీ సర్వీసెస్ కంపెనీ విప్రో, జూన్ త్రైమాసికంలో కన్సాలిడేషన్ బేసిస్‌లో రూ. 2,870 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది 12% YoY వృద్ధి. కార్యకలాపాల ఆదాయం రూ. 21,528 కోట్ల నుంచి 6% పెరిగి రూ. 22,831 కోట్లకు చేరింది. QoQ ప్రాతిపదినక (మార్చి త్రైమాసికంతో పోలిస్తే) మాత్రం కంపెనీ నికర లాభం 6.65%, ఆదాయం 1.55% తగ్గాయి. విప్రో లాభం, ఆదాయాలు రెండూ మార్కెట్ అంచనాలను అందుకోలేదు.
ఫెడరల్ బ్యాంక్: జూన్ త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ. 880.12 కోట్లకు పెరిగింది, YoYలో 38.77% వృద్ధిని సాధించింది. అయితే, QoQ ప్రాతిపదికన మాత్రం లాభం రూ.953.91 కోట్ల నుంచి తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 29% వృద్ధితో రూ. 854 కోట్లుగా నమోదైంది. NII ఏకీకృత పద్ధతిలో 19.57% పెరిగి రూ. 1918.59 కోట్లకు చేరింది.
టాటా మెటాలిక్స్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మెటాలిక్స్ నికర లాభం రూ. 4.55 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే కాలంలోని కేవలం రూ. 1.22 కోట్ల నుంచి కొన్ని రెట్లు వృద్ధి చెందింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ. 55.5 కోట్లతో పోలిస్తే మాత్రం లాభం దాదాపు 92% తగ్గింది.
పతంజలి ఫుడ్స్: OFS కోసం సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి బలమైన రెస్పాన్స్ వచ్చినా, అదనంగా 2% వాటాను విక్రయించే ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఉపయోగించకూడదని పతంజలి ఫుడ్స్ నిర్ణయించుకుంది. ఈరోజు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఈ OFS ఓపెన్ అవుతుంది.
సంవర్ధన మదర్‌సన్: సాడిల్స్ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ అండ్ ఏవియేషన్ ఇంటీరియర్స్‌లో 51% వాటా కొనుగోలును సంవర్ధన మదర్‌సన్ పూర్తి చేసింది.
దీప్ ఇండస్ట్రీస్: భారతదేశంలోని చమురు &గ్యాస్ ఇండస్ట్రీకి చమురు వెలికితీత పరికరాలను సరఫరా చేసే బిడ్స్ సమర్పించడానికి, యూరో గ్యాస్ సిస్టమ్స్‌తో కలిసి ఈ కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది.
JBM ఆటో: JBM ఆటో, దీని అనుబంధ సంస్థలు గుజరాత్, హరియాణా, దిల్లీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ STUలకు, ఫార్చ్యూన్ 500 లిస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీలకు దాదాపు 5000 ఎలక్ట్రిక్ బస్సులు పంపిణీ చేసే ఆర్డర్లు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌కు లాభాలు తెచ్చి పెట్టిన 9 స్టాక్స్, YTD 40% పైగా ర్యాలీ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial