Stocks to watch 21 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Airtel, Shyam Metalics స్ట్రాటెజీలు సూపర్
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 21 December 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 72 పాయింట్లు లేదా 0.39 శాతం గ్రీన్ కలర్‌లో 18,498 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
భారతి ఎయిర్‌టెల్: తన స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కింద లెమ్నిస్క్‌లో (Lemnisk) దాదాపు 8 శాతం వ్యూహాత్మక వాటాను ఈ టెలికాం ఆపరేటర్ కొనుగోలు చేసింది. బెంగళూరుకు చెందిన లెమ్నిస్క్ రియల్ టైమ్ మార్కెటింగ్ ఆటోమేషన్, సురక్షిత వినియోగదారు సమాచార వేదికను (CDP) అందిస్తుంది.
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ: రిజల్యూషన్ ప్రక్రియ ద్వారా మిట్టల్ కార్ప్ లిమిటెడ్‌ను (Mittal Corp Ltd) కొనుగోలు చేయడం ద్వారా స్టెయిన్‌లెస్ స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు ఈ మెటల్ ప్లేయర్ వెల్లడించింది. తన మెటల్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి రాబోయే 4-5 సంవత్సరాల్లో సుమారు రూ. 7,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
VIP క్లోథింగ్: ఈ టెక్స్‌టైల్ ప్లేయర్ ఇటీవలే ఉంబర్‌గావ్ ఫ్యాక్టరీని విక్రయించి రూ. 10.41 కోట్లు సేకరించింది. ఈ ఆస్తిని విక్రయించడం ద్వారా పొందిన డబ్బును మూలధనంగా మార్చి, ఉత్పత్తి, సాంకేతికత, ఆవిష్కరణ, మార్కెటింగ్ వంటి విభిన్న అంచెల్లో ఉపయోగించుకుంటుంది.
డాబర్ ఇండియా: ప్రమోటర్స్ అయిన బర్మన్ కుటుంబం, కొన్ని వెంచర్లకు ఫైనాన్సింగ్ కోసం ఈ FMCG మేజర్‌లో ఓపెన్ మార్కెట్ ద్వారా దాదాపు 1 శాతం వాటాను విక్రయించింది. డాబర్ ఇండియా మెజారిటీ వాటాదారులలో బర్మన్ కుటుంబం ఒకటి.
సిటీ యూనియన్ బ్యాంక్: మార్చి 2022తో ముగిసిన సంవత్సరానికి రూ. 230 కోట్ల మొత్తానికి 13 రుణగ్రహీతల ఖాతాలు, రూ. 29 కోట్ల మొత్తానికి 218 మంది రుణగ్రహీతలతో కలిపి, మొత్తం రూ. 259 కోట్ల మేరకు ఎన్‌పీఏలను డైవర్జ్ చేసినట్లు ఈ బ్యాంక్ ప్రకటించింది. 2022.
జూబిలెంట్ ఇంగ్రేవియా: స్పెషాలిటీ కెమికల్స్ ప్లేయర్ కమర్షియల్ పేపర్స్ జారీ ద్వారా రూ. 150 కోట్లు సేకరించింది. మెచ్యూరిటీ తేదీ ఫిబ్రవరి 2023, కూపన్ రేటు సంవత్సరానికి 7.05 శాతం.
యునో మిండా: తన అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ సెన్సార్ల ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి కొరియాలోని అస్సెంటెక్‌తో లైసెన్స్ ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకుంది. సెజాంగ్ ఇండస్ట్రియల్‌కు అనుబంధ సంస్థ అయిన Asentec, కొరియా, వియత్నాం, చైనాలో ఉన్న ఫ్యాక్టరీల్లో సెన్సార్లు, యాక్యుయేటర్ల వంటి మొబిలిటీ విడిభాగాల తయారీలో నిపుణత కలిగి ఉంది.
సుందరం ఫైనాన్స్: ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, తన కస్టమర్లకు ప్రత్యేక ఆరోగ్య బీమా పరిష్కారాలను అందించడానికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తన విస్తృత నెట్‌వర్క్ ద్వారా కేర్ హెల్త్ ఆఫర్ చేసే ఆరోగ్య బీమా పరిష్కారాలను సుందరం ఫైనాన్స్ అందిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.