Stock Market Update: శుక్ర, సోమవారాల్లో రూ.11,45,267 కోట్లు హాంఫట్..! మార్కెట్లు నేడెలా ఉన్నాయంటే?
సోమవారం ఘోరంగా పతనమైన మార్కెట్లు నేడు గ్యాప్‌అప్‌తో మొదలవ్వడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు! ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెనవ్వడంతో ఇక్కడా కొనుగోళ్లకు దిగుతున్నారు.
భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ఆరంభమయ్యాయి. సోమవారం ఘోరంగా పతనమైన మార్కెట్లు నేడు గ్యాప్‌అప్‌తో మొదలవ్వడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు! ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెనవ్వడంతో ఇక్కడా కొనుగోళ్లకు దిగుతున్నారు.
నేటి ఉదయం 9:16 గంటలకు సెన్సెక్స్ 471 పాయింట్లు లాభంతో మొదలై 56,293 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 133 పాయింట్లు గ్యాప్‌అప్‌తో మొదలై 16747 వద్ద కొనసాగుతోంది. 9:30 గంటలకు సెన్సెక్స్ 736, నిఫ్టీ 215, బ్యాంక్ నిఫ్టీ 491 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ 50లో సిప్లా మినహా 49 కంపెనీలు లాభాల్లోనే ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, టెక్ మహీంద్రా, టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ 2.30 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉన్నాయి.
సోమవారం స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒకానొక దశలో 1800 పాయింట్లు నష్టపోయింది. చివరికి 1189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 371 పాయింట్ల నష్టంతో 16,614 వద్ద ముగిసింది. శుక్రవారం, సోమవారం మార్కెట్లు మరీ ఎక్కువగా పతనం అవ్వడంతో బీఎస్‌ఈలో రూ.11,45,267 కోట్ల సంపద ఆవిరైంది. శుక్రవారం రూ.4.65 లక్షల కోట్లు నష్టపోగా మిగిలినది సోమవారం హరించుకుపోయింది.
Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్ చూడండి మరి!
Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!
Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ