Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెళ్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
Mumbai : ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. విలువైన వస్తువులేమీ దొరకలేదు. అలా వెళ్లిపోకుండా ఉత్త చేతుల్తో ఏమి వెళ్తామని ఆ ఇంటావిడకు ముద్దు పెట్టాడు. అక్కడే అసలు కథ ప్రారంభమయింది.
Mumbai Thief Kisses Woman Before Leaving The House Empty-Handed In Malad: దొంగతనానికి వెళ్లి ఫుల్లుగా తాగి, తిని పడుకునే దొంగల్ని చాలా మందిని చూసి ఉంటాం. పోలీసులు వారిని అరెస్టు చేసినప్పుడు ఇంత అన్ ప్రొఫెషనల్స్ ఎలా ఇలాంటి క్లిష్టమైన ఫీల్డులోకి వస్తారబ్బా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్లు అన్ని చోట్లా ఉంటారు. ముంబైలో కూడా ఉంటారు. ఆ దొంగతనానికి వెళ్లిన ఇంట్లో నిద్రపోలేదు.. కానీ ఇంటావిడకు ముద్దు పెట్టాడు. అంతకు మించి ఏమీ చేయలేదు. కానీ దొంగోడి గుట్టు రట్టయిపోయింది. పోలీసులు పట్టుకున్నారు. తర్వాత వారి స్టైల్లో బాగా ముద్దులు పెట్టేసి ఉంటారని చెప్పాల్సిన పని లేదు.
ముంబైలోని మలాడ్ ఏరియాలో ఎక్కువగా చిరుద్యోగులు నివసిస్తూ ఉంటారు. ఓ కాలనీలో జనవరి మూడో తేదీన మగవాళ్లు పనులు, ఆఫీసులకు వెళ్లిపోయిన తర్వాత ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఫేస్ కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఆ దొంగంను చూసి ఇంటావిడ వణికిపోయింది. చేతిలో ఆయుధం కూడా ఉండటంతో ఓ మూలన ఉండిపోయింది. ఆ దొంగ దర్జాగా ఇల్లు మొత్తం వెదికాడు. ఎక్కడా విలువైన వస్తువు కనిపించలేదు. చివరికి ఆమె మెడలో కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఉందని తెలిసి ఫీలైపోయాడు. ఏమీ దొరకకపోవడంతో ఉత్త చేతులతో ఎలా వెళ్లాలనుకున్నాడో కనీ.. ఆ ఇంటావిడకు ఓ ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఇంట్లోని ఏమైనా వస్తువులు తీసుకెళ్తే ఊరుకునేదేమో కానీ.. తనకు ముట్టుకోవడం, ముద్దుపెట్టడంతో ఆ మహిళ ఊరుకోలేదు. అతని వెంట పడింది. దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఇతర ఆధారాలు చూసి ఆ దొంగెవరో ఇట్టే కనిపెట్టారు. రెండు గంటల్లో ఆ దొంగెవరో అరెస్టు చేసి పట్టుకొచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి ఎవరికీ ముద్దులు పెట్టకుండా ఆ దొంగకు ట్రీట్ మెంట్ ఇస్తామని ఆమెకు పోలీసులు హామీ ఇచ్చి పంపేశారు.
దొంగతనం చేయడానికి పోయినప్పుడు అసలు పని చేయకుండా ఈ కొసరు పని చేయడం వల్ల ఆ దొంగ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అతను పాత దొంగే కావడంతో పోలీసు రికార్డుల్లో కూడా ఉన్నాడు. ఈ కేసు మలాడ్ ప్రాంతంలో కలలం రేపింది..