X

Share Market Update: మార్కెట్లలో పండగ కళ..! సెన్సెక్స్‌ 500+లో, నిఫ్టీ 18000పైన

స్టాక్‌ మార్కెట్లలో పండగ కళ కనిపించింది. సోమవారం సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. నిఫ్టీ 18వేల ఎగువన ముగిసింది.

FOLLOW US: 

భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం పరుగులు తీశాయి. బీఎస్‌సీ సెన్సెక్స్‌ 500 పాయింట్లు లాభపడితే నిఫ్టీ 18000 పైన ముగిసింది. పవర్‌, మెటల్‌, ఆయిల్‌, గ్యాస్‌ స్టాక్స్‌ రాణించాయి. బ్యాంకు, ఫార్మాను పక్కనపెడితే మిగతా అన్ని రంగాల సూచీలు అదరగొట్టాయి.

కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడం, చమురు ధరలపై పన్నులు తగ్గడం, పీఎంఐ గణాంకాలు బాగుండటం, పండగ సీజన్లో విక్రయ గణాంకాలు పుంజుకోవడంతో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు.
క్రితం సెషన్లో 60,067 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సోమవారం 60,385 వద్ద ఆరంభమైంది. ఒకానొక దశలో 59,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 60,609 వద్ద గరిష్ఠాన్ని అందుకున్న సూచీ 477 పాయింట్ల లాభంతో 60,545 వద్ద ముగిసింది. గ్యాప్‌ అప్‌తో నిఫ్టీ 18,040 వద్ద ఆరంభమైంది. 17,836 వద్ద కనిష్ఠాన్ని తాకి మధ్యా్‌హ్నం 18,087 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 151 పాయింట్ల లాభంతో 18,068 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐవోసీ, టైటాన్‌, బజాజ్ ఫిన్‌సర్వ్,అల్ట్రా సెమ్‌కో షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా 3 శాతం లాభపడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఏకంగా 10 శాతం నష్టపోయింది. దివీస్‌ ల్యాబ్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, హిందాల్కో నష్టాల్లో ముగిశాయి. సన్‌ నెట్‌వర్క్‌, వర్క్‌హట్‌ ఫలితాల్లో అదరగొట్టాయి.

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు

Also Read: Cheapest car loan: కార్‌ కొంటారా? ఇంత కన్నా తక్కువ వడ్డీకి ఎవరూ లోన్‌ ఇవ్వరు..! కొన్ని రోజులే ఛాన్స్..!

Also Read: Provident Funds: ప్రావిడెంట్‌ ఫండ్స్‌ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిTags: sensex Nifty Closing Bell share market stocks

సంబంధిత కథనాలు

HDFC FD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..? హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లు పెంచింది మరి

HDFC FD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..? హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లు పెంచింది మరి

Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Stock Market Update: శుక్రవారం ఎర్రబారింది! సెన్సెక్స్‌ 764, నిఫ్టీ 204 డౌన్

Stock Market Update: శుక్రవారం ఎర్రబారింది! సెన్సెక్స్‌ 764, నిఫ్టీ 204 డౌన్

Cryptocurrency Prices Today: నష్టాల్‌.. నష్టాల్‌! కొనసాగుతున్న బిట్‌కాయిన్‌ పతనం

Cryptocurrency Prices Today: నష్టాల్‌.. నష్టాల్‌! కొనసాగుతున్న బిట్‌కాయిన్‌ పతనం

Centre on Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధం రద్దు! బిల్లు పేరును మారుస్తున్న కేంద్రం.. వివరాలు ఇవే!

Centre on Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధం రద్దు! బిల్లు పేరును మారుస్తున్న కేంద్రం.. వివరాలు ఇవే!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు