అన్వేషించండి

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిలయన్స్‌ జియో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు.

Jio Network Outage: రిలయన్స్‌ జియో వాడుతున్నారా? మంగళవారం కొన్ని గంటల పాటు మొబైల్‌ నెట్‌వర్క్‌ పనిచేయలేదా? అయితే ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిలయన్స్‌ జియో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎవరికీ కాల్‌ చేయలేకపోయారు. కనీసం రిసీవ్‌ చేసుకోవడానికీ కుదర్లేదు. ఎస్‌ఎంఎస్‌ సేవలూ ఆగిపోయాయి.

నవంబర్‌ 29 ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు రిలయన్స్‌ జియో డౌన్‌ అయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సమయం నెట్‌వర్క్‌ సేవలు నిలిచిపోయాయి. మొబైల్‌ డేటా పనిచేయడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలపై ఎక్కువ ప్రభావం కనిపించింది. దీంతో యూజర్లు జియో ఔటేజ్‌ గురించి ట్విటర్లో  పోస్టులు పెడుతున్నారు. కొందరు మీమ్స్‌ పంచుకున్నారు.

జియో సేవలు నిలిచిపోవడంతో కొందరు యూజర్లు టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ సమస్యలు ఎదుర్కొన్నారు. బ్యాంకింగ్‌, స్టాక్‌ బ్రోకింగ్‌ వంటి చాలా యాప్స్‌ ఓపెన్‌ చేసేందుకు ఓటీపీలు అవసరం. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ సమస్య వల్ల ఓటీపీలు రాలేదు. జియో ఔటేజ్‌ వల్ల చాలామంది యూజర్లు ఇబ్బందులు పడ్డ విషయాన్ని ఔటేజ్‌ డిటెక్షన్‌ వెబ్‌సైట్‌ డౌన్‌ డిటెక్టర్‌ సైతం గుర్తించింది. ముంబయి, దిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎక్కువ ప్రభావం కనిపించినట్టు పేర్కొంది.

సేవలు నిలిచిపోవడంపై రిలయన్స్‌ జియో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతరాయానికి కారణాలేంటో వెల్లడించలేదు. ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించినట్టు తెలిసింది. జియో సేవలకు అంతరాయం కలగడం ఈ ఏడాది ఇదే తొలిసారి కాదు. అక్టోబర్‌, జూన్‌, ఫిబ్రవరిలోనూ డేటా, కాల్స్‌ ఆగిపోయాయని యూజర్లు రిపోర్టు చేశారు. చాలాసార్లు సాయంత్రం సమయాల్లో డేటా పనిచేయడం లేదని, వేగం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Alphabet Stock Crash: చరిత్రలోనే తొలిసారిగా అల్ఫాబెట్‌ షేర్లు భారీ పతనం.. ఒకే రోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!
చరిత్రలోనే తొలిసారిగా అల్ఫాబెట్‌ షేర్లు భారీ పతనం.. ఒకే రోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
 Jio Maraket Listing: జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
 జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget