అన్వేషించండి

RBI MPC Meet: రెండ్రోజుల్లో RBI MPC సమావేశం - ఈసారైనా వడ్డీ రేట్లు తగ్గుతాయా?

RBI Repo Rate: గత ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు (వరుసగా ఏడోసారి‌) రెపో రేట్‌, రివర్స్‌ రెపో రేట్‌, బ్యాంక్‌ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ మార్చలేదు.

RBI MPC Meet June 2024: దేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ 'ద్రవ్య విధాన కమిటీ' (Monetary Policy Committee) ఈ నెలలో సమావేశం కాబోతోంది. ఈ భేటీ బుధవారం (05 జూన్‌ 2024) నాడు ప్రారంభమై, మూడు రోజులు కొనసాగి, శుక్రవారం (07 జూన్‌ 2024) నాడు ముగుస్తుంది. 

ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులు.. దేశంలో ద్రవ్యోల్బణం ‍‌(Inflation), స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు (GDP Growth Rate), ద్రవ్య లోటు (Fiscal Deficit), విదేశీ మారక నిల్వలు ‍‌(Foreign exchange reserves) సహా దేశ ఆర్థిక స్థితిగతులను పరిశీలించి, రెపో రేట్‌పై (Repo Rate) నిర్ణయం తీసుకుంటారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ఈ సమావేశం ఫలితాలను శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రకటిస్తారు. 

వరుసగా ఎనిమిదోసారి యథాతథం!
గత ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు (వరుసగా ఏడోసారి‌) రెపో రేట్‌, రివర్స్‌ రెపో రేట్‌, బ్యాంక్‌ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ మార్చలేదు. ఈ నెలలోనూ అదే నిర్ణయం తీసుకుంటే, పాలసీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఎనిమిదోసారి అవుతుంది.

2022 మే - 2023 ఫిబ్రవరి మధ్యకాలంలో రెపో రేటును దఫదఫాలుగా 250 బేసిస్‌ పాయింట్లు (2.50%) పెంచి 6.50 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ కొనసాగిస్తోంది. గత 16 నెలలుగా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

అంచనాలను మించిన GDP - అదుపులో ద్రవ్యోల్బణం
2024 జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 7.8 శాతంగా నమోదైంది. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) అంచనాలను మించి 8.2 శాతానికి చేరింది. ప్రధానంగా తయారీ & గనుల రంగాల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఇదే జోరు FY25లోనూ కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.

ప్రధాన ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్‌ పరిధిలోనే (2% - 6%) ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 4.83 శాతానికి చేరుకుంది, మార్చిలో ఇది 4.85 శాతం ఉంది.

ఈ నేపథ్యంలో... ఈసారి కూడా ఆర్‌బీఐ ‘వసతి ఉపసంహరణ’ (withdrawal of accommodation) వైఖరి కొనసాగుతుందని, జూన్‌ భేటీలోనూ వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంక్‌ మార్చకుండా యథాతథంగా ఉంచుతుందని ఆర్థిక నిపుణులంతా ఏకగ్రీవంగా చెబుతున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న విషయానికి వస్తే... ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి RBI రెపో రేట్‌ తగ్గడం ప్రారంభమవుతుందని ఎక్కువ మంది అంచనా వేశారు.

Q3 FY25 ‍(2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం) నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభమవుతుందని స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Q4 FY25 ‍(2025 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం) నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభమవుతుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ICRA నిపుణులు లెక్కలు వేశారు.

జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌ తర్వాత ఇంటర్‌బ్యాంక్ లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడతాయని అంచనా. అప్పటి వరకు, లిక్విడిటీని పెంచడానికి వేరియబుల్ రేట్ రెపోస్ (VRRs) వంటి తాత్కాలిక చర్యలను RBI తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనే టైమ్‌ వచ్చింది, భారీగా తగ్గిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Kawasaki KLX230: ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇండియాలో కవాసకీ సూపర్ బైక్ లాంచ్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget