News
News
X

Rakesh Jhunjhunwala Update: ఈ షేరుతో ఒక్కరోజులోనే రూ.21 కోట్లు ఆర్జించిన రాకేశ్‌ ఝుంఝున్‌వాలా.. ఏంటా షేరు?

ఇండియన్‌ వారెన్ బఫెట్‌గా భావించే రాకేశ్‌ ఝుంఝున్‌వాలా ఒక్కరోజులోనే రూ.20.53 కోట్ల లాభం ఆర్జించారు. జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేర్ల కొనుగోలుతో స్టాక్‌ మార్కెట్లో ఆయన తన సంపదను మరింత పెంచుకున్నారు.

FOLLOW US: 

ఇండియన్‌ వారెన్ బఫెట్‌గా భావించే రాకేశ్‌ ఝుంఝున్‌వాలా ఒక్కరోజులోనే రూ.20.53 కోట్ల లాభం ఆర్జించారు. జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేర్ల కొనుగోలుతో స్టాక్‌ మార్కెట్లో ఆయన తన సంపదను మరింత పెంచుకున్నారు. అంతేకాకుండా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ధర సరికొత్త 52 వారాల గరిష్ఠానికి చేరుకోవడం విశేషం.

రాకేశ్‌ ఝుంఝున్‌వాలాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మంగళవారం 50 లక్షల జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేర్లను రూ.220.44 చొప్పున కొనుగోలు చేసింది. బుధవారం ఈ షేరు రూ.261.5 వద్ద ముగిసింది. దాంతో ఒక్కో షేరుకు రాకేశ్‌ రూ.41 వరకు సంపాదించారు. మొత్తం రూ.20.53 కోట్లు ఆర్జించారు.

Also Read: Tata Sons: టాటాసన్స్‌లో నాయకత్వ మార్పు.. కొత్తగా సీఈవో నియామకానికి ప్రతిపాదన! ఎందుకిలా?

జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేరు మంగళవారమూ బాగానే రాణించింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠమైన రూ.295.15 చేరుకొని 12 శాతం లాభపడింది. రాకేశ్‌ కొనుగోలు చేసిన ధర కన్నా 34 శాతం ఎక్కువగా ర్యాలీ అయింది. అయితే రాకేశ్‌ ఝుంఝున్‌వాలా లేదా రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లు షేర్‌ హోల్డింగ్‌ ప్యాట్రెన్‌లో కనిపించలేదు. కంపెనీలో ఒకశాతం కన్నా ఎక్కువ షేర్లు కొనుగోలు చేసినవారి పేర్లే కనిపిస్తాయి.

Also Read: ఒక్కరోజు ఆలస్యంతో ఎంత వడ్డీ నష్టపోతారో తెలుసా? పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై, ఈపీఎఫ్‌ జమ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి!

రేర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ మాత్రమే కాకుండా మంగళవారం మరికొన్ని సంస్థలూ జీ షేర్లను బల్క్‌గా కొనుగోలు చేశారు.

* బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ యూరప్‌ ఎస్‌కే 48.65 లక్షల షేర్లను సగటున రూ.236.2కు కొనుగోలు చేసింది.
* జంప్‌ ట్రేడింగ్‌ ఫైనాన్షియల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1.02 కోట్ల షేర్లను సగటున రూ.236.50కు కొనుగోలు చేసి రూ.236.66కు విక్రయించింది.
* మాన్సి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ అడ్వైజర్స్‌ 60.78 లక్షల షేర్లను రూ.233.8కి కొనుగోలు చేసి రూ.233.69కి అమ్మేసింది.
* సర్జెక్టివ్‌ రీసెర్చ్‌ క్యాపిటల్‌ ఎల్‌ఎల్‌పీ 50 లక్షల షేర్లు, 80.53  లక్షల షేర్లను వేర్వేరు లావాదేవీల్లో రూ.220.44 కొని 80.58 లక్షల షేర్లను రూ.238.92కు విక్రయించింది. 
* ఎక్స్‌టీఎక్స్‌ మార్కెట్స్ ఎల్‌ఎల్‌పీ 55.80 లక్షల షేర్లను రూ.241.37కు కొని 55.16 లక్షల షేర్లను 242.20 సగటు ధరకు విక్రయించింది.

రీ రేటింగ్ ఆశలతో గత ట్రేడింగ్‌ సెషన్లోనూ జీ షేరు ధర 40 శాతం పెరిగింది. జీలో అతిపెద్ద పెట్టుబడిదారులైన ఇన్వెస్కో, ఓఫ్‌ఐ గ్లోబల్‌ ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునిత్‌ గోయెంకాను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరో ఇద్దరు డైరెక్టర్లైన మనీశ్‌, అశోక్‌ను ఉద్వాసన పలకాలని కోరాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం మార్కెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read: IPL 2021, Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌లో రాజసమెంత? టైటిల్‌ గెలవాలంటే ఏం చేయాలి?

Published at : 15 Sep 2021 04:02 PM (IST) Tags: Rakesh Jhunjhunwala stock in news zeel stock markets

సంబంధిత కథనాలు

Stock Market Closing: సెన్సెక్స్‌ 60k టచ్‌ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!

Stock Market Closing: సెన్సెక్స్‌ 60k టచ్‌ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!

Top Loser Today August 16, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 16, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

టాప్‌ గెయినర్స్‌ August 16, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

టాప్‌ గెయినర్స్‌ August 16, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

Salary Hike: గుడ్‌ న్యూస్‌! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్‌ పెరుగుదల!

Salary Hike: గుడ్‌ న్యూస్‌! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్‌ పెరుగుదల!

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!