అన్వేషించండి

Tata Sons: టాటాసన్స్‌లో నాయకత్వ మార్పు.. కొత్తగా సీఈవో నియామకానికి ప్రతిపాదన! ఎందుకిలా?

మెరుగైన కార్పొరేట్‌ పరిపాలన కోసం ప్రముఖ వ్యాపార సంస్థ టాటా సన్స్‌ ప్రత్యేకంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) పోస్టును సృష్టించనుందని తెలిసింది.

ప్రముఖ వ్యాపార సంస్థ టాటా సన్స్‌ ఆసక్తికర అడుగులు వేయబోతోందని సమాచారం.  మెరుగైన కార్పొరేట్‌ పరిపాలన కోసం ప్రత్యేకంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) పోస్టును సృష్టించనుందని తెలిసింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు అనేక సంస్థలు టాటాసన్స్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సంస్థ వ్యాపార విలువ ఏకంగా 106 బిలియన్‌ డాలర్ల పైమాటే. 

కొత్తగా ప్రతిపాదన

ఇప్పటివరకు టాటాసన్స్‌కు ప్రత్యేకంగా సీఈవో లేకపోవడం ఆశ్చర్యకరమే. బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్ల ఛైర్మనే అన్ని బాధ్యతలు చూసుకుంటారు.  ప్రస్తుత వ్యాపార ధోరణులు, మార్పులకు అనుగుణంగా సీఈవో పోస్టును సృష్టించాలని భావిస్తోంది. కాగా వాటాదారులు, ఇతర కీలక బాధ్యతలను ఛైర్మనే చూసుకుంటారని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. 

కార్యనిర్వహణ పరంగా టాటాసన్స్‌కు సీఈవో అవసరమే లేదని అంటున్నారు. అనేక సంస్థలు ఈ హోల్డింగ్‌ కంపెనీ పరిధిలోనే ఉన్నా ఇప్పటి వరకు నేరుగా ఎలాంటి ఆపరేషన్స్‌ చేపట్టలేదు. పైగా అది అన్‌లిస్టెడ్‌ కంపెనీ కావడం గమనార్హం. అయితే టాటా ట్రస్టుల ఛైర్మన్‌ ప్రస్తుత ప్రతిపాదనను అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
 
చంద్రశేఖరన్‌కు పొడగింపు

టాటాసన్స్‌ మంగళవారమే 103వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) వర్చువల్‌గా నిర్వహించింది. ఫిబ్రవరితో ముగిసిపోనున్న టాటాసన్స్ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని పొడగించాలని ప్రతిపాదించింది.  టాటా గ్రూప్‌ కంపెనీల్లో కీలకమైన టాటా స్టీల్‌ అధినేత టాటా సన్స్‌ సీఈవో అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఇక ఛైర్మన్‌, సీఈవోల బాధ్యతల్లో స్పష్టమైన పని విభజన జరగాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి పదవికీ ప్రత్యేకమైన బాధ్యతలు ఉండాల్సిందేనని సెబీ గతంలో తెలపడం గమనార్హం.

సీఈవో నియామకానికి ప్రత్యేక కారణం

టాటా సన్స్‌కు ప్రత్యేకంగా సీఈవోను నియమించడానికి కారణం ఉందని తెలిసింది. రతన్‌ టాటా ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకొన్నప్పుడు సైరస్‌ మిస్త్రీని వారసుడిగా ప్రకటించారు. ఆ తర్వాత మిస్త్రీ సంస్థ నిబంధనలు, విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని విమర్శలు వచ్చాయి.  ఆ పదవి నుంచి ఉద్వాసన పలికినా మిస్త్రీ న్యాయపోరాటానికి దిగారు. ఈ మధ్య కాలంలో సంస్థ నాయకత్వం ఒడుదొడుకులకు లోనవుతోంది!  అనేక అధికార కేంద్రాలు ఏర్పడటం పెట్టుబడిదారుల్లో గందరగోళానికి తెరతీసింది. అందుకే ప్రత్యేకంగా సీఈవో పదవిని సృష్టించేందుకు పూనుకున్నారని తెలిసింది.

కొత్త సీఈవోకు సవాళ్లెన్నో! 

టాటాసన్స్‌ సీఈవోగా ఎంపికయ్యే వ్యక్తి మున్ముందు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాటా స్టీల్స్‌ పది బిలియన్‌ డాలర్ల నికర అప్పుల్లో ఉంది. ల్యాండ్‌ రోవర్‌ను కొనుగోలు చేసిన టాటా మోటార్స్‌ వరుసగా మూడేళ్ల నుంచి నష్టాలు చవిచూస్తోంది. డిజిటల్‌ రంగంలో టాటా సన్స్‌ తన ముద్ర వేయాలనుకుంటోంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు, సేవలను విక్రయించే ఆల్‌ ఇన్‌ వన్‌ ఈ కామర్స్‌ యాప్‌ను అభివృద్ధి చేయాలని టాటాసన్స్‌ నిర్ణయించింది. వాయిదా పడిన ఆ యాప్‌ రూప కల్పనను తిరిగి పట్టాలెక్కించాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget