PMEGP Loan: 25 లక్షల వరకు రుణం, 35% సబ్సిడీ! మీ వ్యాపారానికి కేంద్రం చేయూత! అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
PMEGP Loan:వ్యాపారవేత్తగా ఎదగాలనే ఆలోచన ఉన్న వాళ్లకు కేంద్రం ఆర్థికంగా సాయం చేసేందుకు ముందకొస్తోంది. మీరు ఐడియా ఉంటే చాలు 25 లక్షల వరకు సాయం అందిస్తోంది.

PMEGP Loan: చాలా మందిలో వ్యాపారం చేయాలనే ఆలోచన రోజురోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గ పెట్టుబడి లేదని వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి కేంద్రం సాయం చేస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా 25 లక్షల వరకు లోన్ ఇస్తుంది. ఇందులో 35శాతం సబ్సిడీ కూడా ఉంటుంది. అంటే మీరు కట్టాల్సింది 65శాతమే.
కొత్తగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్లకు, ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉండి మంచి ఫ్యాక్టరీ పెట్టాలనుకునే వాళ్లకు కేంద్రం చేయూతనిస్తుంది. PMEGP ద్వారా మీరు వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. కేంద్రం ఇచ్చే లోన్‌లో 35 సబ్సిడీ కూడా లభిస్తుంది. మిగతా డబ్బులను మీరు నెల నెల వాయిదాల రూపంలో చెల్లించవచ్చు.
పిఎంఈజిపి అంటే ఏంటీ
పిఎంఈజిపి అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. ఇందులో గ్రామీణ, పట్టణ యువత ఎవరైనా చేరవచ్చు.
పీఎంఈజిపికి ఎవరు అర్హులు?
ఈ పీఎంఈజిపికి అప్లై చేసుకోవాలంటే ముందుగా ఆ వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. ఆ వ్యక్తి వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. విద్యార్హత 8వ తరగతి వరకు చదువుకునే ఉంటే చాలు. ఈ అర్హతలు ఉన్న ఎవరైనా ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
వీళ్లు అనర్హులు
ఈ పథకం కింద కొత్త ఆలోచనతో వ్యాపారం చేసే వాళ్లకు మాత్రమే ఇస్తారు. పాత వ్యాపారాన్ని విస్తరిస్తామంటే డబ్బులు ఇవ్వు. గతంలో ఇలాంటి పథకాల ద్వారా లోన్‌లు తీసుకున్న వాళ్లు అనర్హులు. మీరు ఎలాంటి చట్టబద్ధమైన వ్యాపారం చేసినా ప్రభుత్వం లోన్ ఇస్తుంది. అయితే అది పాతి లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. అంతకు మించి ఇవ్వదు. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం సబ్సిడీ ఇస్తే పట్టణ ప్రాంతాల్లో 25శాతం సబ్సిడీ ఇస్తుంది. అంటే పదిలక్షల రూపాయల లోన్ తీసుకుంటే 3.50 లక్షల రూపాయలు వెనక్కి ఇవ్వాల్సిన పని లేదు.
ఎలాంటి వ్యాపారాలు చేయాలి?
పీఎంఈజిపి కింద కొన్ని వ్యాపారాలను సూచించారు. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తయారీ రంగం, సర్వీస్ రంగం ఇలా వివిధ రకాల వ్యాపారలు వాటి డీపీఆర్‌లు ఇందులో ఉన్నాయి. దాదారు వెయ్యికిపైగా వ్యాపార ఐడియాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. అందులో మోడల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను తీసుకొని మీకు ఉన్న ఐడియా ప్రకారం మార్చుకొని బ్యాంకు వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది.
పీఎంఈజిపికి ఎలా అప్లై చేయాలి?
పీఎంఈజిపి అప్లై చేయాలంటే ముందుగా మీరు చేపట్టబోయే ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి. ఎలా చేయాలి. ఎలాంటి లాభాలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎంతమంది మ్యాన్‌పవర్ కావాలి. స్కిల్డ్ మ్యానపవర్ ఎంతమంది కావాలి. లాంటి అనేక విషయాలపై పూర్తి అవకాగారన ఉండాలి. అందుకే మీకు ఉన్న ఐడియాను బట్టి వెబ్‌సైట్‌లో ఉన్న మోడల్ ప్రాజెక్టును ఒక్కసారి పరిశీలించండి. అప్పుడు ఎలా డీల్ చేయాలో మీరు అంచనాకు రావచ్చు. ఆ తర్వాత అప్లై చేసుకోవడం మంచిది.
స్టెప్-1 :- ముందు అధికారిక వెబ్‌సైట్ https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jspను సందర్శించాలి.
స్టెప్-2 :- ప్రాజెక్ట్ రిపోర్ట్, అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి.
స్టెప్-3 :- ఎంపిక చేసిన ఏజెన్సీకి మీ అప్లికేషన్‌ను సెండ్ చేస్తారు.
స్టెప్-4 :- అప్లికేషన్ ఆమోదం తర్వాత ఈడిపి ట్రైనింగ్ పూర్తి చేయాలి
స్టెప్-5 :- ట్రైనింగ్ తర్వాత బ్యాంకు నుంచి ఫైనల్ లోన్ అమోదం పొందుతుంది
స్టెప్-6 :- వ్యాపారం ప్రారంభించిన తర్వాత సబ్సిడీ అమలవుతుంది
స్టెప్-7 :- మీరు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పిఎంఈజిపికి అప్లై చేయాలంటే కావాల్సిన పత్రాలేంటీ?
పిఎంఈజిపికి అప్లై చేయాలి అంటే ఆధార్ కార్డ్. ఎనిమిదవ తరగతి ఆపై చదువుకున్న విద్యార్హత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫోటోలు, కొటేషన్లు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డ్ అవసరం అవుతాయి.
పిఎంఈజపి లోన్ రీపేమెంట్ ఎలా చెల్లించాలి?
పిఎంఈజిపి ద్వారా వచ్చిన లోన్‌ను ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రిజర్వేషన్లు, ఉండే ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటుంది. ఇది కూడా మూడు నుంచి ఏళ్లే మధ్య చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసి వారికి 5% మార్జిన్ మనీ ఓసి వారికి 10% మార్జిన్ మనీ ఈఎంఐ , వ్యాపారం ఆదాయం ఆధారంగా ఫైనాన్స్ చేస్తారు.





















