Petrol-Diesel Price, 30 November: శుభవార్త.. మరోసారి తగ్గిన ఇంధన ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల, నేటి రేట్లు ఇవీ..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర రూ0.16 పైసలు తగ్గి రూ.107.72 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.15 పైసలు తగ్గి రూ.94.16 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.33 పైసలు తగ్గింది. దీంతో రూ.109.76 గా ఉంది. డీజిల్ ధర రూ.0.31 పైసలు తగ్గి రూ.96.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరుకు రూ.0.06 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.96 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.08 పైసలు తగ్గి రూ.96.98గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.71గా ఉంది. పాత ధరతో పోలిస్తే రూ.0.14 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.13గా ఉంది. లీటరుకు ఇది రూ.0.13 పైసలు తగ్గింది.
చిత్తూరు జిల్లాలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.18 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.33 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.97.16 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా నవంబరు 29 నాటి ధరల ప్రకారం 70.91 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!
Also Read: UAN-Aadhar Linking: నవంబర్ 30 లోపు యూఏఎన్, ఆధార్ లింక్ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు
Also Read: SBI Credit Card ALERT : మరో 3 రోజులే..! డిసెంబర్ 1 నుంచే ఎస్‌బీఐ అదనపు ఛార్జీలు
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి