Petrol-Diesel Price, 27 September: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర తాజాగా రూ.0.16 పైసలు పెరిగి రూ.105.42 అయింది. డీజిల్ ధర రూ.0.43 పైసలు పెరిగి రూ.97.35 గా ఉంది.
![Petrol-Diesel Price, 27 September: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే.. Petrol Diesel Price Today 27 September 2021 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 27 September: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/30/7bed1fd04b84e705486545d821c41a57_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది.
తెలంగాణలో సెప్టెంబరు 27న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర తాజాగా రూ.0.16 పైసలు పెరిగి రూ.105.42 అయింది. డీజిల్ ధర రూ.0.43 పైసలు పెరిగి రూ.97.35 గా ఉంది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.104.77గా ఉంది. డీజిల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.96.73 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా స్వల్పంగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.19 పైసలు పెరిగి రూ.105.62గా ఉంది. డీజిల్ ధర రూ.0.45 పైసలు పెరిగి రూ.97.52కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్ ధర రూ.0.15 పైసలు పెరిగి రూ.107.10 గా ఉంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.41 పైసలు పెరిగి రూ.98.90 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: గులాబ్ తుపాను ప్రభావం.. ఏపీలో కుంభవృష్టి, తెలంగాణలో మరో 3 రోజులు దంచికొట్టనున్న వానలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.49 గా ఉంది. డీజిల్ ధర రూ.98.91కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.02గా ఉంది. గత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.31 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.98.42గా స్థిరంగానే ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో బాగా పెరుగుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.32 పైసలు పెరిగి రూ.107.98 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.55 పైసలు పెరిగి రూ.99.30గా ఉంది.
Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో రద్దైన, దారిమళ్లించిన రైళ్ల వివరాలివే...
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 27 నాటి ధరల ప్రకారం 73.62 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దని హెచ్చరికలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)