By: ABP Desam | Updated at : 22 May 2022 06:55 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో నేడు భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు బాగా తగ్గాయి. నేడు లీటరుకు పెట్రోల్ ధర రూ.9.83 తగ్గింది. దీంతో నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.7.67 తగ్గి రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. కానీ, నేడు (మే 22) పెట్రోల్ ధర రూ.10.02 పైసలు తగ్గి రూ.109.16 గా ఉంది. డీజిల్ ధర రూ.7.84 పైసలు తగ్గి రూ.97.35 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.9.37 పైసలు తగ్గి రూ.111.80 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.7.23 పైసలు తగ్గి రూ.99.81 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు భారీగానే తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.9.78 పైసలు తగ్గి రూ.111.76 గా ఉంది. డీజిల్ ధర రూ.7.62 పైసలు తగ్గి రూ.99.51 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే లీటరు ధర రూ.9.52 పైసలు తగ్గి రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.7.38 పైసలు తగ్గి రూ.98.27గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.9.52 పైసలు తగ్గి.. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర నేడు రూ.112.55 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.7.38 పైసలు తగ్గి రూ.100.19గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 17 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 114.51 డాలర్ల స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?
Petrol-Diesel Price, 3 July: నేడు ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు షాక్! మిగతా చోట్ల సాధారణమే!
Gold-Silver Price: నేడు పసిడి ధర షాక్! ఏకంగా రూ.150 పెరుగుదల, వెండి మాత్రం భారీ ఊరట
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Stock Market Weekly Review: సూచీల ఊగిసలాట! ఇన్వెస్టర్ల సంపదలో భారీ కోత!!
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్