Petrol-Diesel Price, 15 November: గుడ్‌న్యూస్! పెట్రోల్, డీజిల్ ధరల్లో ఊరట, ఇక్కడ మాత్రం స్థిరంగా.. తాజా రేట్లు ఇలా..
నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.30 పైసలు పెరిగి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.29 పైసలు పెరిగి రూ.96.38 గా ఉంది.
కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, తాజాగా కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కాస్త ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగింది. దీంతో తాజా ధర రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.30 పైసలు పెరిగి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.29 పైసలు పెరిగి రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. లీటరుకు రూ.0.14 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.23 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.13 పైసలు తగ్గి రూ.96.31గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.57గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.52 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.66గా ఉంది. ఇది లీటరుకు రూ.0.48 పైసల చొప్పున పెరిగింది.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.51 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.63 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి రూ.97.46గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా నవంబరు 15 నాటి ధరల ప్రకారం 80.34 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: MobiKwik RuPay Card: మొబిక్విక్ రూపే కార్డు.. ముందే రూ.30వేలు వాడేసుకోవచ్చు..! మరెన్నో ఆఫర్లు..!
Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి