Petrol Diesel Price 13 November 2021: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇలా
దేశంలో ఇవాళ(శనివారం) పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో చమురు ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 94.62, లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.107.88గా ఉంది. డీజిల్ ధర రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర. రూ.108.07, డీజిల్ ధర రూ.94.49 గా ఉన్నాయి.
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.46 పైసలు పెరిగి.. రూ.108.38గా ఉంది. డీజిల్ ధర రూ.0.43 పైసలు పెరిగి రూ.94.78 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.11 పైసలు పెరిగి రూ.110 గా ఉంది. డీజిల్ ధర రూ.0.10 పైసలు పెరిగి రూ.96.29 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి.
Also Read: ఈ మూడు రాశుల వారికీ భలే మంచి రోజు.. ఇందులో మీ రాశి ఉందా..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.96.36గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.57గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.08 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.66గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. చిత్తూరులో ఇంధన ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.110.69 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.96.70గా ఉంది.
Also Read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా గోల్డ్ రేట్, కాస్త పెరిగిన వెండి... ఇవాళ్టి ధరలు ఇలా
Also Read: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణపై సైతం అల్పపీడనం ప్రభావం
Also Read: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు