Maoist RK Books: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు
హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో మావోయిస్టు ఆర్కే పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ ప్రెస్ ను పీవోడబ్ల్యూ సంధ్య భర్త రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాములో శుక్రవారం పోలీసుల సోదాలు చేశారు. నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుకుని తనిఖీలు చేశామన్నారు. ఇటీవలే అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణించారు. సుమారు 1000 పుస్తకాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అడిషనల్ డీసీపీ మురళీధరరావు, మలక్ పేట్ ఏసీపీ వెంకటరమణ, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్
మావోయిస్టు భావజాలం పెంపొందించేలా పుస్తకాలు
నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో ఆర్కే జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. బైండింగ్ చేసిన వెయ్యి పుస్తకాలు, బైండింగ్ చెయ్యని పుస్తకాల మెటీరియల్ ని కూడా సీజ్ చేశామని ఏసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. పుస్తకాల ప్రింటింగ్ సంబంధించి ఎలాంటి రశీదులు లేవన్నారు. పుస్తకాలలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉందని ఏసీపీ వెల్లడించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి గత కొంత కాలంగా మావోయిస్టు అనుబంధ సంఘాలకు తోడ్పపడుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పీవోడబ్ల్యూ సంధ్య భర్త పేరిట ప్రింటింగ్ ప్రెస్
ఈ ప్రెస్ లో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ పీవోడబ్ల్యూ సభ్యురాలు సంధ్య భర్త రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సమయంలో ఆర్కే భార్య శిరీష, పీవోడబ్ల్యూ సభ్యురాలు సంధ్య ప్రింటింగ్ ప్రెస్ వద్దకు చేరుకున్నారు. బైండింగ్ చేసిన వెయ్యి పుస్తకాలను, మెటిరియల్‌ను సీజ్ చేసినట్టు మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. పుస్తకాల ప్రింటింగ్‌కు సంబంధించి ఎలాంటి రశీదులు లేవన్నారు. పుస్తకాలలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన భావజాలం ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ వివరించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా మావోయిస్టు అనుబంధ సంఘాలకు తోడ్పాటునందిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అక్టోబర్ 14న ఆర్కే అనారోగ్యంతో కన్నుమూశారు. మావోయిస్టు ఉద్యమానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ రామకృష్ణ అలియాస్ ఆర్కే సొంతూరు.
Also Read: ప్రాజెక్టుల వివరాలు తక్షణం పంపండి.. రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ !