అన్వేషించండి

AP Vs Telangana: సీఎం జగన్ బిచ్చమెత్తుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి... సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఏపీ మంత్రి కౌంటర్

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తెలంగాణ మంత్రి.. జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటే... ఏపీ మంత్రి.. కౌంటర్ ఇచ్చారు.

ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజలు బిచ్చమెత్తుకుని బతకాల్సి వస్తుందని అప్పట్లో ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారన్నారు. కానీ ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వానికి నిధులు లేక కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటోందని విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఏం చెప్పినా ఏపీ సీఎం జగన్ చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరి కాబట్టి ఏపీలో మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశమంతా మీటర్లను వ్యతిరేకిస్తుంటే సీఎం జగన్ మాత్రం కేంద్రం చెప్పింది వింటూ కీలుబొమ్మగా మారారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.

Also Read: యాసంగి వడ్లు కొంటరా ? కొనరా? తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు !

పేర్ని నాని కౌంటర్

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ పై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి న్యాయపరంగా రావాల్సిన నిధుల కోసం పోరాడుతున్నామని మంత్రి అన్నారు. "తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే దిల్లీ వెళ్తున్నారు కదా... ఆయనెందుకు వెళ్తున్నారు. ఏం అడుక్కోడానికి వెళ్తున్నారు. కేంద్రంలో మేము చేరతాం... మా తలుపులు తెరిచే ఉన్నాయని తెలంగాణ నేతలు చెప్తున్నారు. ఇంటి బయట కాలర్ ఎగరేసి... ఇంట్లో కాళ్లు పట్టుకోవడం, జగన్ కు చేతకాదు. జగన్ కు దోస్తీ అంటే దోస్తీ సై అంటూ సై. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తుంది.  హైదరాబాద్ ను అన్యాయంగా పంచేసుకుని కబుర్లు చెబుతున్నారు. పాడికుండ లాంటి హైదరాబాద్ ను పంచేసుకుని ఇప్పుడు కబర్లు చెబుతున్నారు. ఎవడి మీదో అక్కసు కక్కలేక ఏపీపై విమర్శలు చేస్తున్నారు" అని మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. 

Also Read:  పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?

టీడీపీలాగే టీఆర్ఎస్ మాట్లాడుతుంది : సజ్జల

ఏపీ సీఎం జగన్​పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు వారి విచక్షణకే వదిలేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించటం సరికాదని అన్నారు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని సీఎం కేసీఆర్ అన్నారని, ఈ మాటలు తెలంగాణ మంత్రులు వినబడలేదా అని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అవలంబిస్తుందన్నారు. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకన్న సజ్జల.... కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో టీడీపీ నేతల్లాగే టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.

Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget