News
News
X

KRMB : ప్రాజెక్టుల వివరాలు తక్షణం పంపండి.. రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ !

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ మరో లేఖ రాసింది. తక్షణం ప్రాజెక్టుల వివరాలు పంపాలని ఆదేశించింది.

FOLLOW US: 

ప్రాజెక్టులను నోటిఫై చేసి తమ అధీనంలోకి తీసుకునేందుకు కృష్ణాబోర్డు చేస్తున్న ప్రయత్నాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోయినా కేఆర్ఎంబీ మాత్రం తను చేయాల్సిన పనులు చేస్తూ పోతోంది. తాజాగా రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు లేఖలు రాసింది. ప్రాజెక్టుల వివరాలు పంపాలని కోరింది. ప్రాజెక్టుల గేట్ల అవుట్ లెట్ల వివరాలు, గేట్ల ఓపెనింగ్ - జనరేషన్ అలాగే .. వంద ఏళ్ల వరద,  కెనాల్ షూటింగ్ మ్యాపింగ్ వివరాలు కూడా పంపాలని కోరింది. జూరాల, శ్రీశైలం,సాగర్ సహా ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలను కోరింది.

Also Read : సీఎం జగన్ బిచ్చమెత్తుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి... సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఏపీ మంత్రి కౌంటర్

నాలుగు రోజుల క్రితం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని కేఆర్ఎంబీ చైర్మన్ లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ తో పాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలన్నారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ గెజిట్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.  

Also Read: యాసంగి వడ్లు కొంటరా ? కొనరా? తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు !

శ్రీశైలం స్పిల్ వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ-నీవా సాగర్ కుడి కాలువ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగిస్తూ గత నెల 14వ తేదీనే ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను ఇచ్చినప్పుడే తమ ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని షరతు విధించింది. దీంతో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సందిగ్ధంలో పడింది. ఇక ఇప్పటి దాకా 9 అవుట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై తెలంగాణ సర్కార్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. 

Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్

ఈ కారణంగానే కేఆర్ఎంబీ వరుసగాలేఖలు రాస్తోంది. తక్షణమే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేయాలని.. వివరాలు అందించాలని కోరుతోంది. కేసీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఒక డ్రామాగా అభివర్ణించారు. కేసీఆరే డ్రామా ఆడుతున్నారని కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ రివర్స్‌లో విమర్శించారు. 

Also Read : తెలంగాణలో మరో ఉపఎన్నికకు బీజేపీ ప్లాన్ ! ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధమయ్యారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 08:04 PM (IST) Tags: telangana ANDHRA PRADESH KRMB Krishna board Telugu States Water Dispute Projects Notified Gazette Implementation

సంబంధిత కథనాలు

Pawan Kalyan Yatra :  అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

టాప్ స్టోరీస్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

Raghunandan Rao: మంత్రి తుపాకీ ఫైరింగ్: గన్‌లో రబ్బరు బుల్లెట్లా? SPనీ నిందితుడిగా చేర్చాల్సిందే - బీజేపీ ఎమ్మెల్యే

Raghunandan Rao: మంత్రి తుపాకీ ఫైరింగ్: గన్‌లో రబ్బరు బుల్లెట్లా? SPనీ నిందితుడిగా చేర్చాల్సిందే - బీజేపీ ఎమ్మెల్యే

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు