News
News
వీడియోలు ఆటలు
X

Horoscope Today 13 November 2021: ఈ మూడు రాశుల వారికీ భలే మంచి రోజు.. ఇందులో మీ రాశి ఉందా..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
Share:

మేషం
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయంలో సవాళ్లను అధిగమిస్తారు. దూరపు బంధువులతో సమావేశమవుతారు. ఇనుము వ్యాపారులకు కలిసొస్తుంది. అవసరమైనవారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.  పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 
వృషభం
విహారయాత్రలకు వెళ్లే ప్లాన్ వేసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు మంచి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది.  మీ ఆలోచనలను సమతుల్యంగా ఉంచండి.  మీరు చేసే పనిపట్ల అసంతృప్తిగా ఉంటారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. 
మిథునం
ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులు నష్టం కలిగించవచ్చు.  కొత్తగా ఏ పనీ ప్రారంభించకండి. ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావం ఉండొచ్చు. తప్పుడు సలహా ఇచ్చే వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు శుభసమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
కర్కాటకం
ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. ప్రతికూల ఆలోచనల ప్రభావం మీపై చాలా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఏదో విషయంపై బాధపడతారు. పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం.  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పూర్తి కాన్సన్ ట్రేషన్ పెట్టాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు.
సింహం
మీ బాధ్యతను నిర్వర్తించగలరు. చేసేపనిపై పూర్తిస్తాయి దృష్టి సారించండి. పెద్ద ఒప్పందాలు రద్దు చేసుకోవచ్చు. ఉద్యోగంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్నిఎవరిపైనా రుద్దకండి. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. 
కన్య
ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తికావు. కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితులను కలుస్తారు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. 
Also Read:  అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
తుల
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. పుస్తకాలను చదవడానికి సమయాన్ని వెచ్చించండి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడతారు. కొత్త ప్రణాళికను ప్రారంభిస్తారు. రుణం మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోవద్దు.
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు. ఎవరైనా మీ గౌరవాన్ని దెబ్బతీయవచ్చు. పెట్టుబడి పెట్టాలనే ఆలోచన చేయకండి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. అనవసర పనులపై సమయాన్ని వృథా చేయకండి. దంపతుల మధ్య విభేదాలు సమసిపోతాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. 
ధనుస్సు
ఈ రోజు మీ మనస్సు మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. స్నేహితులను కలుసుకోవచ్చు. శారీరక ఇబ్బంది నుంచి ఉపశమనం పొందుతారు. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
Also Read: శివుడికే కాదు మనకూ మూడో కన్ను ఉందని మీకు తెలుసా...!
మకరం
తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. ముందుగా నిర్ణయించిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చు. తొందరపాటు వల్ల నష్టం జరగొచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరైనా మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నించవచ్చు. మీ అభిప్రాయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. 
కుంభం
ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కోరుకున్న పని చేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సహోద్యోగులు ఉద్యోగంలో సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.  జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. 
మీనం
వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. స్నేహితుడి మాటలు బాధించవచ్చు. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.  జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. గోప్యమైన విషయాలను అందరితో పంచుకోవద్దు.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అనవసరంగా ఖర్చు చేయకండి. 
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Nov 2021 06:18 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Daily Horoscope Today 13\ November 2021

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!

Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?