Gold Silver Price Today 13 November 2021 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా గోల్డ్ రేట్, కాస్త పెరిగిన వెండి... ఇవాళ్టి ధరలు ఇలా
భారత్ మార్కెట్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. కానీ వెండి ధరలు మాత్రం ఈరోజు(శనివారం) పెరిగాయి. పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి.
భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ వెండి మాత్రం కేజీకి రూ.800 పెరిగింది. 22 క్యారెట్ల ధర గ్రాముకు రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.50,070గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.50,070
- దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460
- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,270, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,270
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070
Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి.. స్వామి అని ఎందుకు పిలవాలి...
వెండిధరలు:
భారత మార్కెట్ లో వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.8 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.67,100 ఉండగా, చెన్నైలో రూ.71,400గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.67,100 ఉండగా, కోల్‌కతాలో రూ.67,100, బెంగళూరులో కిలో వెండి రూ.67,100 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 71,400 వద్ద కొనసాగుతోంది.
Also Read: వందేళ్ల తర్వాత కాశీకి చేరిన అన్నపూర్ణ విగ్రహం...ఈ నెల 15న పున:ప్రతిష్టాపన
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: ఈ మూడు రాశుల వారికీ భలే మంచి రోజు.. ఇందులో మీ రాశి ఉందా..