By: ABP Desam | Updated at : 12 Jan 2022 07:14 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత మూడు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది వారాలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉంటుండగా.. నేడు (జనవరి 12) కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 గా ఉండగా.. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.24 పైసలు పెరిగి రూ.110.27 గా ఉంది. డీజిల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.96.54 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.12 పైసలు పెరిగి రూ.110.41గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.11 పైసలు పెరిగి రూ.96.47 గా ఉంది.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర రూ.0.10 పైసలు పెరిగి రూ.109.15 గా ఉంది. డీజిల్ ధర రూ.0.10 పైసలు పెరిగి రూ.95.28గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో స్థిరంగా ధరలు..
తిరుపతిలో ఇంధన ధరలు నేడు తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.1.42 పైసలు తగ్గి రూ.109.92 వద్ద ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర తాజాగా రూ.1.30 పైసలు తగ్గి రూ.96.01 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా జనవరి 12 నాటి ధరల ప్రకారం 81.5 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం!!
Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు
Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్