Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (RIIHL) ద్వారా ఈ ఒప్పందం కుదిరింది. ఓరియెంట్ హోటల్ పరోక్ష యజమాని కొలంబస్ సెంటర్ కార్పొరేషన్ షేర్ క్యాపిటల్‌లో 73.37 శాతం వాటా దక్కించుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యూయార్క్‌లోని విలాసవంతమైన మాండరిన్ ఓరియెంట్ హోటల్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం 98.15 మిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఇంతకు ముందే బ్రిటన్‌లోని ఐకానిక్ స్టోక్ పార్క్‌ను రిలయన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
రిలయన్స్ ఇండస్ట్రీ సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (RIIHL) ద్వారా ఈ ఒప్పందం కుదిరింది. ఓరియెంట్ హోటల్ పరోక్ష యజమాని కొలంబస్ సెంటర్ కార్పొరేషన్ షేర్ క్యాపిటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు ద్వారా ఈ లావాదేవీ పూర్తి చేయనుంది.
న్యూయార్క్‌లోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో మాండరిన్ ఓరియెంటల్ ఒకటి. దీనిని 2003లో కొలంబస్ సర్కిల్‌లో అందమైన సెంట్రల్ పార్క్ పక్కన నిర్మించారు. ఈ హోటల్‌కు ఎన్నో రేటింగ్స్, పురస్కారాలు లభించాయి. ట్రిపుల్ ఏ ఫైవ్ డైమండ్ అవార్డ్, ఫోర్బ్స్ ఫైవ్‌స్టార్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్‌స్టార్ స్పా గౌరవం దక్కింది. కరోనా మహమ్మారి రావడంతో ఈ హోటల్ ఆదాయం తగ్గిపోయింది. 2018లో 115 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయం 2019లో 113కు మిలియన్ డాలర్లకు, 2020లో 15 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
ఈ కొనుగోలుతో రిలయన్స్ కన్జూమర్, హాస్పిటాలిటీ వ్యాపారం మరింత పెరగనుంది. రిలయన్స్ ఇప్పటికే ఒబెరాయ్ హోటల్స్‌లో పెట్టుబడి పెట్టింది. ముంబయిలో అద్భుతమైన కన్వెన్షన్ సెంటర్, హోటల్‌ను నిర్మిస్తోంది. ఓరియెంట్ హోటల్ కొనుగోలు వ్యవహారం 2022 మార్చికి పూర్తవుతుంది. స్థానిక చట్టాలు, ఆమోదాలకు కట్టుబడి ఇది ఉంటుంది. హోటల్‌లో మిగిలిన యజమానుల నుంచి 26.63 శాతం వాటా కొనుగోలు చేసేందుకూ రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: DMart Q3 results: డీమార్ట్ అదుర్స్! భారీ లాభాలు ఆర్జించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్
Also Read: Satya Nadella: Growwలో పెట్టుబడి పెట్టిన Microsoft సీఈవో సత్య నాదెళ్ల
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!