అన్వేషించండి

Crypto Credit Cards: మార్కెట్లో క్రిప్టో క్రెడిట్‌ కార్డులు! బ్యాంకు కార్డులకు వీటికి తేడా ఏంటో తెలుసా?

క్రిప్టో క్రెడిట్‌ కార్డుల ప్రక్రియ కాస్త భిన్నంగా, సంక్లిష్టంగానే ఉంటోంది. ఈ కార్డులు సొంతం చేసుకున్నవారు క్రిప్టోల రూపంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Crypto Credit Cards: క్రిప్టో కరెన్సీ క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ డిజిటల్‌ అసెట్‌పై పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలోనూ క్రిప్టో నియంత్రణ బిల్లుపై స్పష్టత వస్తే పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. చాలా దేశాల్లో క్రిప్టోలను కరెన్సీకి మారకంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని కంపెనీలు డిజిటల్‌ కరెన్సీగా వీటినే ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో క్రెడిట్‌ కార్డులు బూమ్‌లోకి వచ్చాయి.

ఏంటీ క్రిప్టో క్రెడిట్‌ కార్డు?

సాధారణ క్రెడిట్‌ కార్డుల్లాగే క్రిప్టో క్రెడిట్‌ కార్డులు పనిచేస్తాయి. యూజర్లకు రివార్డులు ఇస్తున్నాయి. అవీ క్రిప్టోల రూపంలోనే! ఏదేమైనా క్రిప్టో క్రెడిట్‌ కార్డుల ప్రక్రియ కాస్త భిన్నంగా, సంక్లిష్టంగానే ఉంటోంది. ఈ కార్డులు సొంతం చేసుకున్నవారు క్రిప్టోల రూపంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెల్లింపులూ అలాగే చేయాలి. ఇంతకు క్రిప్టో డెబిట్ కార్డులు ఉన్న సంగతి తెలిసిందే.

క్రిప్టో క్రెడిట్‌ కార్డుదారులు కార్డు జారీ చేసిన సంస్థల నుంచే అప్పు తీసుకొని తర్వాత చెల్లిస్తారన్నమాట. సాధారణ క్రెడిట్‌ కార్డు వ్యవస్థల్లాగే ఇదీ ఉంటుంది. వాటికీ దీనికీ తేడా ఏంటంటే తిరిగి చెల్లించడమూ క్రిప్టోల రూపంలోనే ఉంటుందన్నమాట. రివార్డులు కూడా బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ వంటి క్రిప్టోల్లోనే ఇస్తారు.

రివార్డులు ఏంటి?

కంపెనీలను బట్టి రివార్డుల్లో తేడా ఉంటుంది. జెమినీ క్రెడిట్‌ కార్డు వాళ్లు బిట్‌కాయిన్‌ల రూపంలో మూడు శాతం పేబ్యాక్‌ ఇస్తున్నారు. ఇది వెంటనే జెమినీ క్రెడిట్‌ కార్డు వినియోగదారు ఖాతాల్లో డిపాజిట్‌ అవుతుంది. బ్లాక్‌ఫై క్రెడిట్‌ కార్డు వాళ్లు బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ సహా పది క్రిప్టోల రూపంలో 1.5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. సోఫై క్రెడిట్‌ కార్డుల్లోనూ ఇంతే. ఇక వెన్‌మో క్రెడిట్‌ కార్డు సంస్థ మాత్రం ఏదైనా కొనుగోళ్లపై వచ్చిన క్యాష్‌బ్యాక్‌తో బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌, లైట్‌కాయిన్‌ను కొనుగోలు చేసేందుకే అనుమతి ఇస్తోంది.  బ్రెక్స్‌ బిజినెస్‌ కార్డు  సంస్థా ఇంతే.

బిల్లు ఆలస్యమైతే!

క్రిప్టో క్రెడిట్‌ కార్డుల్లోనూ బిల్లులు వెంటనే చెల్లించకపోతే భారీ పెనాల్టీ తప్పదు. అధిక వడ్డీ, ఆలస్య రుసుమూ వసూలు చేస్తారు. మీ క్రెడిట్‌ స్కోరు పైనా దీని ప్రభావం ఉంటుంది. సాధారణ క్రెడిట్‌ కార్డుల మాదిరిగానే వీటికీ వార్షిక రుసుములు ఉంటాయి. అందుకే క్రిప్టో క్రెడిట్‌ కార్డు తీసుకొనే ముందే పరిమితులు, షరతులు తెలుసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి.

Also Read: పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయలేదా? పదివేల ఫైన్‌ తప్పదు మరి!!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget