News
News
X

DMart Q3 results: డీమార్ట్‌ అదుర్స్‌! భారీ లాభాలు ఆర్జించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌

డీమార్ట్‌ స్టోర్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 22 శాతం పెరిగింది. గ్రాస్‌ మార్జిన్‌ మాత్రం కాస్త తగ్గింది. సాధారణ మర్చండైజ్‌, దుస్తుల విక్రయాలు కాస్త తగ్గాయి.

FOLLOW US: 

DMart Q3 results: అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (DMart) అదరగొట్టింది! 2021, డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.586 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. దాదాపు 24.6 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రాధాకిషన్‌ దమానీకి చెందిన డీమార్ట్‌ రూ.470 కోట్ల నికర లాభం నమోదు చేయడం గమనార్హం.

ఆపరేషన్స్‌ రాబడి 22 శాతం పెరిగి రూ.9065 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ.7,432 కోట్లు కావడం గమనార్హం. కాగా శుక్రవారం డీమార్ట్‌ షేర్లు 0.5 శాతం లాభపడి రూ.4,730 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. లాభాన్ని మినహాయిస్తే ఖర్చులు సైతం బాగానే పెరిగాయి. ఏడాది క్రితం ఇది రూ.6,977 కోట్లు ఉండగా ఇప్పుడు 21.72 శాతం పెరిగి రూ.8,493 కోట్లుగా ఉంది. 

ఇక నివేదికల ప్రకారం 2022 ఆర్థిక ఏడాదిలో కంపెనీ చివరి తొమ్మిది నెలల ఆదాయం రూ.22,190 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఇది రూ.16,731 కోట్లు. ఎఫ్‌వై 22 తొమ్మిది నెలల నికర లాభం రూ.1066 కోట్లుగా ఎఫ్‌వై 21 తొమ్మిది నెలల నికర లాభం రూ.686తో పోలిస్తే చాలా పెరిగింది.

'డీమార్ట్‌ స్టోర్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 22 శాతం పెరిగింది. గ్రాస్‌ మార్జిన్‌ మాత్రం కాస్త తగ్గింది. సాధారణ మర్చండైజ్‌,  దుస్తుల విక్రయాలు కాస్త తగ్గాయి. నిత్యావసరాలు, ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, తక్కువ అవకాశాలు కొన్ని విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలను మరింత సమర్థంగా కొనుగోళ్లకు ఉపయోగించుంటాం. మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల నిబంధనలను అనుసరించి మా విక్రయాలు ఉంటాయి. ఉద్యోగులు, వినియోగదారుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం' అని డీమార్ట్‌ సీఈవో, ఎండీ నెవిల్‌ నోరోన్హ చెప్పారు.

Also Read: Small Savings Interest Rates: గుడ్‌ న్యూస్‌! చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లపై కేంద్రం తాజా నిర్ణయమిదే!

Also Read: SBI Alert: బీ కేర్‌ఫుల్.. డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేయలేదని ఎస్‌బీఐ అకౌంట్స్ బ్లాక్ చేస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి

Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయలేదా? పదివేల ఫైన్‌ తప్పదు మరి!!

Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. రూ.900 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..

Published at : 08 Jan 2022 05:54 PM (IST) Tags: Net Profit DMart Q3 results Dmart Avenue supermarts

సంబంధిత కథనాలు

Stock Market Closing: సెన్సెక్స్‌ 60k టచ్‌ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!

Stock Market Closing: సెన్సెక్స్‌ 60k టచ్‌ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!

Top Loser Today August 16, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 16, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

టాప్‌ గెయినర్స్‌ August 16, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

టాప్‌ గెయినర్స్‌ August 16, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

Salary Hike: గుడ్‌ న్యూస్‌! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్‌ పెరుగుదల!

Salary Hike: గుడ్‌ న్యూస్‌! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్‌ పెరుగుదల!

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

టాప్ స్టోరీస్

BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

BJP :  పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ -  గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

NBK108: బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ - భారీగా ఖర్చు పెడుతున్నారే!

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు