Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. రూ.900 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Gold Price In Hyderabad: వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పతనమయ్యాయి. మరోవైపు వెండి ధర రూ.900 మేర పడిపోయింది.
Gold Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పతనమయ్యాయి. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్లపై రూ.350 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 కి క్షీణించింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.900 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,500కి పడిపోయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.350 మేర పతనమైంది. ఇక్కడ సైతం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,600కు పడిపోయింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 కు క్షీణించింది. ఏపీ, తెలంగాణలో వెండి ధరలు ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. ఢిల్లీలో బంగారం రూ.350 మేర తగ్గడంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000కి పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,510 అయింది. చెన్నైలో రూ.310 మేర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,940 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,860 అయింది.
తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.19 మేర దిగొచ్చింది. నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.23,200 అయింది. ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.23,110 అయింది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.23,200 అయింది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,110 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!