SBI Alert: బీ కేర్‌ఫుల్.. డాక్యుమెంట్స్ అప్‌డేట్ చేయలేదని ఎస్‌బీఐ అకౌంట్స్ బ్లాక్ చేస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి
SBI Latest News: డాక్యుమెంట్స్ ఎక్స్‌పైర్ అయ్యాయని, ఆ కారణంగా మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్ అయిందని మీకు మెస్సేజ్ వస్తుంది. త్వరగా మీరు మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవాలని ఆ మెస్సేజ్ సారాంశాం.

State Bank Of India: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) ఖాతాదారులా. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అకౌంట్ బ్లాక్ అయిందని మీ మొబైల్‌కు, మెయిల్‌కు మెస్సేజ్‌లు వస్తున్నాయి. డాక్యుమెంట్స్ ఎక్స్‌పైర్ అయ్యాయని, ఆ కారణంగా మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్ అయిందని మీకు మెస్సేజ్ వస్తుంది. త్వరగా మీరు మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవాలని ఆ మెస్సేజ్ సారాంశాం.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాంకుకు సమర్పించిన డాక్యుమెంట్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలని మెస్సేజ్ ద్వారా సూచిస్తున్నారు. అయితే ఇది ఫేక్ మెస్సేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. మీ ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని వచ్చే మెస్సేజ్‌లకు స్పందించ రాదని ఫ్యాక్ట్ చెక్ టీమ్ సూచించింది. డాక్యుమెంట్స్ ఎక్స్‌పైర్ అయ్యాయని, వచ్చే మెస్సేజ్‌లకు స్పందించకూడదని ఎస్‌బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి మెస్సేజ్‌లు, ఈ మెయిల్ గానీ వస్తే మీరు వారికి బ్యాంక్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు షేర్ చేయవద్దని హెచ్చరించారు.
A message in circulation claiming that your @TheOfficialSBI account has been blocked is #FAKE #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 6, 2022
▶️ Do not respond to emails/SMS asking to share your personal or banking details.
▶️ If you receive any such message, report immediately at report.phishing@sbi.co.in pic.twitter.com/HXj8Tz1svh
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలాంటి మెస్సెజ్‌లు, మెయిల్స్ వస్తే.. report.phishing@sbi.co.in మెయిల్ కు వెంటనే రిపోర్ట్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సూచించింది. ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ నెంబర్, కార్డుల నెంబర్లు చెప్పాలని, డాక్యుమెంట్స్ ఎక్స్‌పైర్ కావడంతో అకౌంట్ బ్లాక్ అయిందని లాంటి మెస్సేజ్‌లు ఎస్‌బీఐ బ్యాంకులు పంపించవని.. కనుక ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కొందరు ఖాతాదారులు తమకు ఇలాంటి మెస్సేజ్‌లు వచ్చాయని.. అది నిజమేనా అని ఎస్‌బీఐ బ్యాంకు, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్‌కు మెస్సేజ్, ట్వీట్లు, మెయిల్స్ చేశారు. దీనిపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫేక్ అలర్ట్స్ వస్తున్నాయని గుర్తించారు.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
Also Read: Mahesh Babu Covid 19: మహేష్ బాబుకు కోవిడ్-19 పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

